సోదరిని మోసం చేసిన అన్నకు జైలు


Wed,September 12, 2018 03:08 AM

కరీంనగర్ లీగల్ : సోదరిని మోసం చేసిన కేసులో అన్నకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ జూడిషియల్ మెజిస్ట్రేట్ రాజు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విజయలక్ష్మి భర్త సింగరేణిలో పనిచేస్తూ మృతి చెందాడు. పరిహారం కింద సింగరేణి ఆమెకు కొంత నగదు అందజేసింది. పిల్లల భవిష్యత్ కోసం డబ్బును పొదుపు చేయాలని కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఉంటున్న సోదరుడు కొంగర భాస్కరరావును సంప్రదించి, రామచంద్రాపూర్ కాలనీలో ఇంటి స్థలాన్ని ఖరీదు చేసింది. భాస్కర్‌రావు వ్యాపారంకోసం డబ్బు అవసరమనీ, భూమిని తన పేర గిప్ట్ రిజిస్టర్ చేస్తే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటానని నమ్మించాడు. నమ్మిన విజయలక్ష్మి రిజిస్టర్ చేయగా భాస్కర్‌రావు ఆభూమిని అమ్మేసి డబ్బు వాడుకున్నాడు. విషయం తెలిసిన ఆమె సోదరున్ని ప్రశ్నించగా 2012 జూన్ 6న రూ. 7 లక్షలు ఇస్తానని కాగితం రాసిచ్చి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. దీంతో విజయలక్ష్మి కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సీఐ విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి చార్జీషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి రాజు మంగళవారం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

172
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...