సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు

Tue,September 11, 2018 01:25 AM

కరీంనగర్ హెల్త్ : ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని ప్రభుత్వ దవాఖాన నరాల మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వర్షి అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్షణికావేశంలో ఆ త్మహ్య చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు వారి మానసిక పరిస్థితిని శారీరక మార్పులు ఎలా ఉంటాయో వివరించారు. ఈ లక్షణాలు శారీరక జబ్బులు, మానసిక రుగ్మతలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు, విడాకులు, పరీక్షల ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఒంటరితనం, బాధ్యత రహితమైన జీవితం, ఒత్తిడే ఆత్మహత్యకు కారణాలన్నారు. కుటుంబంలో ఎ వరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వంశ పారపర్యంగా కుటుంబంలో అలాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వారిని వెంటనే గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. ప్రభుత్వ దవాఖానాలో ఎలాంటి మానసిక సమస్యలకైనా చికిత్సనందిస్తామని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తామని వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఆర్‌ఎంఓ శ్రీధర్, జనరల్ ఫీజిషియన్ శ్రీనివాస్, నరేందర్‌రావు, నర్సింగ్ సూపరింటెండెంట్ జయప్రద, నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపల్ రమాబాయి, కౌన్సిలర్స్ డాక్టర్ సదానందచారి, స్రవంతి, కుమారస్వామి, రవికిరణ్ పాల్గొన్నారు.

196
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles