పత్తిలో సస్యరక్షణపై అవగాహన


Tue,September 11, 2018 01:24 AM

రామడుగు: మండలంలోని వెదిరలో పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు సోమవారం రైతులకు పత్తిలో సస్యరక్షణపై అవగాహన కల్పించారు. పత్తి పంటలో గులాబీ పురుగుతో పాటు తెల్లదోమ నివారణకు కాయ తొలుచు, రసం పీల్చు పురుగులు కలిగించే నష్టాలతో పాటు వాటి ఉనికిని ఎలా గమనించాలో వివరించారు. నష్ట పరిమితి స్థాయి, నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు సూచించారు. పత్తి పంట నాటిన 45 రోజుల నుంచి గులాబీ పురుగు ఉనికిని గమనించడానికి రైతుల సమక్షంలో ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చారు. తెల్లదోమ నివారణకు పసుపురంగు జిగురు పూసిన అట్టలను(ఎల్లోట్రాప్స్) ఎకరానికి పది చొప్పున అమర్చారు. ఇక్కడ స్థానిక రైతులతో పాటు వ్యవసాయ విద్యార్థులు కీర్తికుమారి, శిరీష, మౌనిక, సుష్మ, శ్వేత, తదితరులు ఉన్నారు. గంగాధర: మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో సోమవారం ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు సమగ్ర సస్యసరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంటను ఆశించిన గులాబీ పురుగును గుర్తించడం, నివారణ, సమగ్ర సస్యరక్షణ విధానం గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు అరుణశ్రీ, మదన్‌మోహన్, ఆత్మ పీడీ ప్రియదర్శిని, ఏడీఎ రామారావు, ఏవో రాజు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...