మంత్రి ఈటలకు మద్దతుగా బైక్ ర్యాలీ


Mon,September 10, 2018 01:19 AM

హుజూరాబాద్‌టౌన్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈటలకు మద్దతుగా పార్టీ నాయకులు ఆదివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ చౌక్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ మంద ఉమాదేవి, వైస్‌చైర్ పర్సన్ తాళ్లపల్లి రజిత, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచి, పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత బండ శ్రీనివాస్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సుమారు 300 మంది బైక్‌లపై పట్టణంలోని అన్ని వాడల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్ జిందాబాద్, ఈటల రాజేందర్ నాయకత్వం వర్దిల్లాలి, హుజూరాబాద్ అభివృద్ధి ప్రదాత జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధిని చూసి మళ్లీ ఈటలకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ కౌన్సిలర్లు కే లావణ్య, ఎం రమేశ్, ఏ ముత్యంరాజు, చింత శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...