ప్లాస్టిక్‌ను అప్పజెప్పండి.. మొక్కలను తీసుకెళ్లండి


Sun,November 17, 2019 03:11 AM

మన్సూరాబాద్, నవంబర్ 16: ప్లాస్టిక్‌పై యద్ధ్దంలో భాగంగా సామాజిక కార్యకర్త దోసపాటి రాము మరో వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. ఇంట్లో ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ కవర్లను అప్పజెప్పి వాటికి సమానమైన బరువు గల మొక్కలను తీసుకెళ్లి ఇంటి పరిసరాలలో పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయం సమీపంలోని కరూర్ వైశ్య బ్యాంకు వద్ద ఉన్న నర్సరీ ప్రాంగణంలో శనివారం ఆయన మాట్లాడారు. కాలుష్యం వెదజల్లే ప్లాస్టిక్‌ను వదిలించుకుని ఆక్సిజన్‌ను అందించే అందమైన మొక్కలను తీసుకెళ్లి ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

282

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles