ఆకట్టుకున్న బేకర్స్ టెక్నాలజీ ఫెయిర్


Sat,November 16, 2019 02:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైటెక్స్‌లో జరిగిన బేకర్స్ టెక్నాలజీ ఫెయిర్, ఇండియా హోరేక ఎక్స్‌పోలో శుక్రవారం ఆహరపదార్థాల తయారీలో వస్తున్న మార్పులపై వక్తలు చర్చించారు. కేవలం లాభాపేక్షతోనే వ్యాపారం కాకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్, బెకరీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండో రోజు జరిగిన ఫెయిర్‌లో ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, హోటల్ కన్సల్టెంట్స్, చెఫ్స్, రీసెర్చర్స్ పలు అంశాలపై మాట్లాడారు. ట్రాన్స్ ఫాట్ అండ్ లైఫ్‌ైస్టెల్ డీసీసెస్‌పై తెలంగాణ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ టి. విజయ్ కుమార్ మాట్లాడారు. ఆహార పదార్థాల తయారీలో ట్రాన్స్ ఫాట్ ఆసిడ్ వాడకంపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఘాడ రసాయనాలు వాడిన పదార్థాలను తయారీలో ఉపయోగించొద్దని కోరారు. అనంతరం బిస్కెట్ల తయా రీపై వక్తలు చర్చించారు. కేకుల తయారీ.. వాటి డిజైనింగ్.. నిమిషాల్లో వందల రొట్టె లు..తదితర ఆహారపదార్థాల తయారీలో వచ్చిన ఎక్విప్‌మెంట్‌ను ఎక్స్‌పోలో ప్రద ర్శనకు ఉంచారు. ఆకలితో వచ్చిన కస్టమర్‌కు వేగంగా సర్వీస్ అందించడమే కాకుండా రుచికరంగా తయారు చేసే బాధ్యత చెఫ్స్‌పై ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎక్వి ప్‌మెంట్‌ను ఎలా వినియోగించాలి? అనే అంశంపై అవగాహన కల్పించారు. దేశ వ్యా ప్తంగా హోటల్, రెస్టారెంట్, కేటరర్స్, హోమ్ బేకర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్యాకింగ్, రుచికరమైన పదార్థాల తయారీ..క్రయవిక్రయాలపై అవగాహన కల్పించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఆహారపదార్థాల తయారీ..కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలి? అంశాలపై పలు సూచనలు చేశారు. 200 బండ్ల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. నేడు ఎక్స్‌పో ముగియనుంది.

320

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles