సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలి


Tue,October 15, 2019 04:00 AM

రవీంద్రభారతి : సాహిత్యాన్ని పరిపుష్టం చేయటానికి మనమందరం కృషిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ0.రమణాచారి అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సింహప్రసాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన డా.వేదగిరి రాంబాబు స్మారక పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకు ముందు డా.వేదగిరి రాంబాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎం.వి.వి.సత్యనారాయణకు డా.వేదగిరి రాంబాబు స్మారక బాలసాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. వహీద్‌ఖాన్‌కు డా.వేదగిరి రాంబాబు స్మారక కథానిక పురస్కారం ప్రదానం చేశారు.


ప్రముఖ రచయిత, కవి విహారి అధ్యక్షతన జరిగిన సభలో రచయిత, నవ్వ వారపత్రిక ఎడిటర్ ఎ.ఎన్.జగన్నాథశర్మ విశిష్టఅతిథిగా పాల్గొని మా కథలు-2018 కథాసంపుటిని ఆవిష్కరించగా, నేషనల్ బుక్ ట్రస్టు సహ సంపాదకులు, కార్యనిర్వాహణ అధికారి డా.పత్తిపాక మోహన్ నూరు కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కథారచయిత్రి వాణిశ్రీ , సంహప్రసాద్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

171

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles