స్లమ్‌లెస్ సిటీగా హైదరాబాద్


Mon,October 14, 2019 01:15 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:గ్రేటర్ హైదరాబాద్‌ను స్లమ్‌లెస్ సిటీగా తయారుచేస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సూరత్‌లో రెండురోజు ల పాటు జరిగిన అఖిలభారత మేయర్ల కార్యనిర్వాహఖ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా గ్రేటర్‌లో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను చేపట్టినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూం, ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా దాదాపు రూ.160 కోట్ల వ్యయంతో చేపట్టిన అతిపెద్ద డంపింగ్ యార్డ్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు క్యాపింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో మరో కార్పొరేషన్‌లలో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విజిలెన్స్, విపత్తుల నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంపై సదస్సు లు మేయర్ వివరించారు. పర్యటనలో భాగం గా సూరత్ కార్పోరేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

283

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles