8900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం


Mon,October 14, 2019 01:12 AM

-ఇద్దరు విక్రేతల అరెస్టు, వాహనాలు సీజ్
కీసర : నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి..వాహనాల్లో తరలిస్తున్న పేలుడు పదార్థాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం..యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో రీజెనసిస్ అనే పేలుడు పదార్థాలకు సంబంధించిన మందుల కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ నుంచి లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుంటారు. మల్లారం గ్రామానికి చెందిన శ్రావన్‌రెడ్డి, సిద్దిపేట్‌కు చెందిన నారాయణలు లైసెన్స్ కలిగిన వ్యక్తులు. ఈ పేలుడు పదార్థాలను విక్రయించడానికి వీరికి డీలర్‌షిప్ కూడా ఉన్నది. వీరు బొమ్మలరామారం నుంచి ఈ పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. శనివారం రాత్రి వీరిద్దరూ కలిసి తెలివిగా బొమ్మలరామారం నుంచి కొనుగోలు చేసిన పేలుడు పదార్థాలను కీసర మండలం వన్నీగూడలోని హర్ష స్టోన్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కీసర పోలీసులకు అప్పగించారు. పోలీసులు పట్టుకున్న వాహనంలో 8900 కిలోల పేలుడు పదార్థాలు(376 బూస్టార్స్), మరో వాహనంలో 165 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్‌తోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కీసర పోలీసులు శ్రావన్‌రెడ్డి, నారాయణలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరిని కోర్టుకు రిమాండ్ చేస్తామని సీఐ తెలిపారు.

69

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles