నేటి నుంచి మరిన్ని బస్సులు


Sun,October 13, 2019 01:28 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో బస్సులు పెంచేందుకు రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రేపటినుంచి బస్సులు పెంచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతీ ఆర్టీవో పరిధిలో ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను అందుబాటులోకి తేవడంతోపాటు మాజీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికల్స్‌ నడపడంలో అనుభవం ఉన్న డ్రైవర్ల కోసం వెదుకుతున్నా రు. ఆర్టీసీ బస్సులతోపాటు విద్యాసంస్థలు, సీసీ బస్సులు, విద్యాసంస్థల బస్సులు, మ్యాక్సీక్యాబ్స్‌ అత్యధికంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏమి కనబడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు మరింత పటిష్ట ఏర్పాట్ల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో వీటిని నియంత్రణలో కి తేవడానికి ఆర్‌టీవో స్థాయి అధికారులు రంగంలోకి దించారు. తాత్కాలిక డ్రైవర్లను ప్రమాదాలు జరుగకుం డా అప్రమత్తం చేస్తూ సర్సీసులను నడుపుతున్నారు. ఆర్టీసీ స్థానంలో ప్రతిరోజూ 3 వేలకు మించి బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు గ్రేటర్‌లో 1400 బస్సులు నడుస్తుండగా మూడ్రోజుల్లో మొత్తం బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


పెరిగిన వ్యక్తిగత వాహనాలు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలు వాడుతున్నారు. దాదాపు నగరం లో 65 లక్షల వాహనాలు ఉండగా వీటన్నింటికి వినియోగిస్తున్నారు. దీంతోపాటు క్యాబ్‌లు, సెట్విన్లు, ఆటోరిక్షాలు, స్కూల్‌ బస్సులు, విద్యా సంస్థల బస్సు లు కూడా నడుస్తుండటంతో ఎటువంటి ఇబ్బందు లు లేకుండా గమ్యస్థానాలకు చేరుతున్నారు. మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా సేవలందిస్తుండటం తో ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యక్తిగత వాహనా లు వాడుతుండటంతో నగరంలోని 600 పెట్రోల్‌ బం కుల్లో డీజిల్‌, పెట్రోల్‌ అమ్మకాలు పెరిగినట్లు పెట్రోల్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో బంకులో సగటున 1,000 లీటర్లకు మించి పెట్రోల్‌ , డీజిల్‌ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. వ్యక్తిగత వాహనాలతోపాటు ట్రాన్స్‌పోర్ట్ట్‌ వాహనాలు ఇంధన వినియోగం కూడా పెరిగిందని చెప్పారు

224

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles