ఫొటో జర్నలిస్టుల సంఘం గ్రేటర్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక


Fri,September 20, 2019 01:50 AM

బషీర్‌బాగ్, సెప్టెంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కేఎన్.హరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ శాఖ నూతన అధ్యక్షుడిగా ఆనంద్ ధర్మాన, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం.అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎ.సురేశ్‌కుమార్, ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వీరగోని రజినీకాంత్ గౌడ్, సహాయ కార్యదర్శిగా ఎస్.సురేందర్ రెడ్డి, కోశాధికారిగా ఎస్.శివకుమార్ మేరు, కార్యవర్గ సభ్యులుగా పరమేశ్వర్ గౌడ్, సయ్యద్ మజూర్ అలీ, ఎం.విజయ్ భాస్కర్, దీపక్ దేశ్‌పాండెలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదాలకు గురికావడం, మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం, సమయానికి వేతనాలు ఇవ్వకపోవడం, అక్రెడిటేషన్, ఉద్యోగ భద్రత లేకపోవడం ఇలాంటి సమస్యలు హైదరాబాద్ నగరంలో ఫొటో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పేర్కొన్నారు.

178

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles