జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘంలో తీర్మానాలు


Fri,September 20, 2019 01:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సమావేశం గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆదాయ, వ్యయ వివరాలకు ఆమోదం తెలుపడంతోపాటు పలు తీర్మానాలు చేశారు. తీర్మానాలు ఇవే.. : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆరుగురు మాజీ వృద్ధ క్రీడాకారులకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న పెన్షన్‌ను మరో ఏడాదిపాటు(మార్చి 2020 వరకు) పొడిగింపు n పార్ట్‌టైమ్ కోచ్‌ల నియామకానికి సంబంధించిన విధివిధానాల ప్రతిపాదన ఆమోదానికి ప్రభుత్వానికి పంపేందుకు తీర్మానం n కొత్తగా నిర్మించిన హిందీనగర్, సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో 8 మంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు తీర్మానం n ఫిర్యాదుల స్వీకరణకు ప్రస్తుతం వినియోగిస్తున్న డయల్-100 సర్వీసులను మరో మూడేండ్లపాటు వినియోగించుకునేందుకు తీర్మానం ఎన్నికల విభాగం కాల్ సెంటర్‌తోపాటు భూసేకరణ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు డేటాఎంట్రీ ఆపరేటర్ల సేవలను మరో ఏడాదిపాటు పొడిగింపు వంటి తీర్మానాలు చేశారు.

180

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles