విషజ్వరాల నివారణకు ప్రణాళిక రూపొందించాలి


Fri,September 20, 2019 01:48 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా వంటి విష జ్వరాల నివారణకు అధికారులు ముందస్తూ ప్రణాళికను రూపొందిస్తే మంచిదని ఫ్యూచరెస్టిక్ సిటీ ప్రెసిడెంట్ కరుణాగోపాల్ అన్నారు. గురువారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో డెంగీ, మలేరియా తదితర జ్వరాల నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కరుణాగోపాల్ మాట్లాడుతూ సాధారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, వర్షాకాలం ప్రారంభానికి ముందే వాన నీరు నిల్వ ఉండకుండా గుంతలను పూడ్చడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం డెంగీ, వైరల్ ఫీవర్స్ వంటి జ్వరాలు నగరాన్ని పీడిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles