గోల్కొండ కోటలో నేడు ఐదో బోనం

Thu,July 18, 2019 03:30 AM

- శాకాంబరి అవతారంలో దర్శనం

మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ కోటలో జరుగుతున్న ఆషాఢ మాసం బోనాలలో గురువారం ఐదో బోనం జరుగనున్నది. ఈ బోనం సందర్భంగా జగదాంబిక ఎల్లమ్మ భక్తులకు శాకాంబరి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం గోల్కొండ కోటపై అమ్మవారి ఆలయంలో కులవృత్తుల సంఘం ఆధ్వర్యంలో అలంకరణ పనులను చేపట్టారు. శాకాంబరి దేవి అమ్మ వారి అలంకరణతో పాటు, ఆలయాన్ని వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించనున్నట్లు ఈవో మహేందర్ కుమార్, బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ జి.వసంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 4 న ప్రారంభం అయిన గోల్కొండ బోనాల లో ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొని ఉంటారని దేవా దాయ, ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు బోనా లను అత్యంత వైభవంగా నిర్వహించడంలో ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ అధికా రులు ఎంతో కృషి చేశారని ఉత్సవ కమిటీ ఛైర్మన్ జి,వసంత్ రెడ్డి పేర్కొన్నారు.

175

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles