అరచేతిలో బస్సుల సమాచారం

Mon,June 17, 2019 03:42 AM

-త్వరలో ఆర్టీసీ యాప్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గమ్యం చేర్చాల్సిన బస్సు ఎక్కడుంది? ఎక్కాల్సిన బస్సు ఏ టైంకు బస్టాప్‌కు వస్తుంది? దిగాల్సిన చోట ఏ టైంకు చేరుకుంటుందనే విషయం తెలియక చికాకు పడుతున్నారా?. బస్టాప్‌లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందా? ఇక అటువంటి ఇబ్బందులకు తావుండదు. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు టీఎస్‌ఆర్టీసీ నడుం బిగించింది. అరచేతిలో అన్ని బస్సుల సమాచారాన్ని ఉంచేలా సర్వీసుల రాకపోకలకు సంబంధించి ఒక యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో బస్సుల రాకపోకలతోపాటు రోడ్డుపై బస్సు ఉన్న ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. వచ్చే సమయాన్ని కూడా అంచనా వేసి యాప్‌లో తెలుపుతారు. ఈ ప్రయోగాన్ని ప్రస్తుతం నగరంలో పరీక్షించగా సిటీ బస్సుల రాకపోకలకు సంబంధించిన కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని తెలుపుతున్నది. దీనిని కరీంనగర్ సిటీ బస్సుల రాకపోకలకు సంబంధించి కూడా పరీక్షించినట్లు టీఎస్‌ఆర్టీసీకీ చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రతీ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ నగరానికి కలిసే స్టేట్ హైవేలు , నేషనల్ హైవేల మీద బస్సుల రాకపోకలకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తయిన వెంటనే యాప్‌ను ఆవిష్కరించి అందుబాటులోకి తెస్తామన్నారు.యాప్‌లో కేటగిరీల వారీగా బస్సులు ఏసీ, నాన్ ఏసీ, సిటీ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సంబంధించి రూట్ నంబర్లు నిక్షిప్తమై ఉంటాయి.

177

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles