సాంకేతిక విద్యతో..అమెరికాలో అవకాశాలు

Sun,June 16, 2019 02:10 AM

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : శాస్త్రసాంకేతిక రంగాల్లో నైపుణ్యం సాధించే విద్యార్థులకు అమెరికాలో మంచి అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సిల్‌ జనరల్‌ ఆర్క్‌ అలెగ్జాండర్‌ అన్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లోని ముఫఖంజా ఇంజినీరింగ్‌ కళాశాలలో మెస్కో ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు చదువులో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత్‌లోని పేద ముస్లిం విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అందుకునేందుకు తమ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ యేడాది భారత్‌ నుంచి 50 మంది ముస్లిం విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం సాయం అందించగా వారిలో 24 మంది హైదరాబాద్‌కు చెందిన వారు ఉండటం విశేషమన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఏకే.ఖాన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ముస్లిం మహిళల్లో అక్షరాస్యత శాతం పెరుగడం శుభపరిణామమని, గురుకుల పాఠశాలల ఏర్పాటుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి జాఫర్‌ జావెద్‌, విద్యావేత్త కమల్‌ ఫారూఖీ, మెస్కో డైరెక్టర్‌ డా.ఫక్రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

197

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles