ప్రకృతి కళలను ప్రోత్సహిద్దాం

Sun,June 16, 2019 02:09 AM

- కోవె తెలంగాణ చాప్టర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు నీరజ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాతావరణానికి అనుకూలమైన ప్రకృతి కళలను ప్రోత్సహించాలని కోవె తెలంగాణ చాప్టర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు గొడవర్తి నీరజ అన్నారు. బేగంపేటలోని కోవె (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌) తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యాన కోవె కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ‘పాటరీ, ఇకెబెనా’ కళలపై వర్క్‌షాపు, అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవె తెలంగాణ చాప్టర్‌ పారిశ్రామికవేత్త, ఇకెబెనా సభ్యురాలు, కోవె ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు గొడవర్తి నీరజ హాజరై మాట్లాడుతూ ‘పాటరీ, ఇకెబెనా’ అనే కళలు ప్రకృతికి, వాతావరణానికి విఘాతం కలిగించే కళలు కాదని, ఇవి ప్రకృతికి అనుకూలమైన కళలని వాటిని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇవి వాతావరణానికి హాని కల్గించేవి కాదని, యువత, మహిళలు ఈ కళలను అభ్యసించి దానిలో పురోగతిని సాధించవచ్చన్నారు. ఈవెంట్‌ మేనేజర్లకు, మహిళలకు ఈ కళ ఎంతగానో దోహదపడుతుందన్నారు.అనంతరం, ఇకెబెనా, పాటరీ కళకారిణి, పాటరీ మేకర్‌, మాస్టర్‌ హేమా పాట్కర్‌ ఔత్సాహిక కళాకారులు, యువతులకు వర్క్‌షాపు నిర్వహించి, కళలపై పలువురికి అవగాహన కల్పించారు. ఈ కళలతో గల ప్రయోజనాన్ని వారికి తెలియజేశారు. ఈ కళలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఏ మేరకు ఈ కళలు ఉపాధి కల్పిస్తాయో అన్న ప్రతి అంశాలపై హేమా పాట్కర్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నేషనల్‌ కోవె సెక్రటరీ సౌదామిని, జాతీయ కోవె సభ్యులు మధు త్యాగి, మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు జ్యోత్స్న, చేతన్‌ జైన్‌, నీరజారెడ్డి పాల్గొన్నారు.

198

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles