బడీడు పిల్లలతో పనులు చేయించొద్దు..

Sun,June 16, 2019 02:08 AM

తెలుగుయూనివర్సిటీ, జూన్‌ 15 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్మిక శాఖ ఉప కమిషనర్‌ శ్యాంసుందర్‌ జాజు పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాలో భాగంగా శనివారం నాంపల్లి రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రయాణికులలో అవగాహన కల్పించారు. స్టేషన్‌లో ప్రయాణికుల విశ్రాంత గదుల్లో, ఫ్లాట్‌ఫారంపై బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పనుల్లో చిన్నారులను పెట్టుకోవడం వల్ల చట్టాల్లో ఉన్న శిక్షకు సంబంధించిన అంశాలు తెలిపేలా ఉన్న పోస్టర్లను గోడలపై అంటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చి మన చుట్టూ ఉండే బడీడు పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించాలని కోరారు. ఎక్కడైనా ఇండ్లలో పిల్లలు పనిచేస్తున్నట్లుగా గమనిస్తే, ఆ సమాచారాన్ని 1098కి ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు.

గతంతో పోల్చితే నగరంలో బాల కార్మికుల సంఖ్య తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తరువాత గణనీయంగా తగ్గిందన్నారు. పిల్లలను పనులకు పంపించే తల్లిదండ్రులకు సరైన అవగాహన కలిపించి బావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్మిక శాఖకు ప్రజలు సహకరిస్తే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. నగర శివారులలో ఉన్న కంపనీలు, హోటళ్లపై నిఘాపెట్టి ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లో నిరంతరం నిఘా పెట్టామని, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు, రైల్వే పోలీసులు, కార్మికులు పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ అధికారులు పీవీ. రమణమూర్తి, కిరణ్‌, కె. పవన్‌, రైల్వే స్టేషన్‌ అధికారులు రవి, అశోక్‌కుమార్‌, ఆర్పీఫ్‌ ఎస్సై రాజు, చైల్డ్‌లైన్‌ సహాయ కేంద్రం సిబ్బంది లలిత, స్వప్న, రాంబాబు, సుభద్ర పాల్గొన్నారు.

154

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles