నేటితో ముగియనున్న ఇఫ్లూ డైమండ్ జూబ్లీ

Tue,April 16, 2019 11:59 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ / ఉస్మానియా యూనివర్సిటీ : ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) గతేడాదితో 60 ఏండ్లు పూర్తిచేసుకోవడంతో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించింది. అయితే ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. 2018 నవంబర్ 15వ తేదీ నుంచి వర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. కేవలం విద్యార్థులు, అధ్యాపకులకే కాకుండా సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పలు ప్రోగ్రామ్‌లను నిర్వహించింది. లాంగ్వేజ్‌ల అభివృద్ధి కోసం పలు అంతర్జాతీయ సదస్సులను ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం నిర్వహిస్తున్న ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి అతిథులుగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కెథరిన్ బి. హడ్డా, టర్కిష్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ టర్కీ డాక్టర్ అడ్నాన్ అల్టే అల్టీనర్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ సురేశ్ చుక్కపల్లి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం నిర్వహించిన సమావేశంలో ఇఫ్లూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఇ.సురేశ్‌కుమార్ వెల్లడించారు. ఇఫ్లూను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్లూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

195

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles