సామాన్యులకు మేలు చేసేలా..పరిశోధనలు జరుగాలి

Tue,April 16, 2019 11:59 PM

బన్సీలాల్‌పేట్, ఏప్రిల్ 15 : సామాన్య ప్రజలకు మేలు చేసేలా, జ్యోతిష్య శాస్త్రంలో మరిన్ని విస్తృతమైన పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉన్నదని భారతీయ జ్యోతిష్య శాస్త్ర మండలి జాతీయ ఉపాధ్యక్షుడు కౌతా లలిత్ మనోహర్ అన్నారు. జేకేఆర్ ఆస్ట్రో రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మారావునగర్‌లోని కౌతా కామకోటి కల్యాణ నిలయంలో నక్షత్ర సిద్ధాంత రూపకర్త, ఆచార్య ఎన్‌వీ.రాఘవాచారి 106వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జేకేఆర్‌ఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎన్‌విఆర్‌ఎ.రాజా మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రం అంటే చీకట్లో చిరుదీపం లాంటిదని, జరగబోయే అనర్థాలను నివారించకపోయినప్పటికీ రాబోయే నష్టాన్ని ముందుగానే చెప్పగలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష్య శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సాగి కమలాకర్, ఐకాస్ వైస్ చైర్మన్ జయరామ్ ప్రసంగించారు. అనంతరం జేకేఆర్‌ఎఫ్ ద్వారా జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఐకాస్ జాతీయ ఉపాధ్యక్షుడు కౌతా లలిత్ మనోహర్ దంపతులను సన్మానించారు.

244

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles