సీఎం కేసీఆర్ ఆశీస్సులతో భారీ మెజార్టీ సాధిస్తా..!


Tue,March 26, 2019 02:36 AM

- ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి
- మల్కాజిగిరి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి నామినేషన్
- మద్దతుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు
- ముందుగా సతీమణితో కలిసి పూజలు
- అభిమానులతో కిక్కిరిసిన ఔటర్


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా తరలివచ్చి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజశేఖర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి కీసర ఔటర్‌కు ర్యాలీగా వచ్చారు. ర్యాలీకి పెద్దత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కీసర ఔటర్ రింగురోడ్డు వద్ద మహిళలు తెలంగాణ సంస్కృతి ప్రతిభించేలా భోనంతో రాజశేఖర్‌రెడ్డికి స్వాగతం పలికారు. కోలాటం ఆడుతూ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బండారు లకా్ష్మరెడ్డితో కలిసి వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ డా.ఎంవీ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను అందించారు.

మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కీసర ఔటర్ రింగురోడ్డు సర్కిల్ గులాబీ శ్రేణులతో కిక్కిరిపోయింది. మహిళలు నాగారం గ్రామం నుంచి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చి రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ మర్రి రాజశేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. సీఎం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవాసం చేసుకోవడం ఖాయమని, దీనికి తెలంగాణ ప్రజల దీవేనలు పుష్పలంగా ఉన్నాయన్నారు. ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి చామకూర మల్లారెడ్డిల ఆశీస్సులతో అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తన గెలుపునకు దోహదం చేస్తాయన్నారు.

353

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles