అపూర్వ స్పందన

Tue,March 26, 2019 02:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉప్పల్ భగాయత్ ఫేజ్-2 లే అవుట్లలోని మల్టీజోన్ ప్లాట్ల ఈ-వేలంపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఔత్సాహిక వేలందారులకు అవగాహన కల్పించారు. ఇంటిస్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో సదావకాశమని, ఎలాంటి వివాదాలు లేని నియమనిబంధనలకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఈ-వేలం చేస్తున్నదని హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఎం.రాంకిషన్ అన్నారు. ఈ-వేలానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రజల నుంచి వస్తున్న విపరీతమైన స్పందన దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంస్థకు చెందిన వెబ్‌సైట్ WWW.HMDA.GOV.INలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి చెందిన వెబ్‌సైట్ WWW.MSTCECOMMERCE. COM లలో పూర్తి వివరాలు పొందుపరిచామని తెలిపారు.

ఏప్రిల్ 7,8వ తేదీల్లో నిర్వహించనున్న ఈ-వేలంలో పాల్గొనే ప్లాట్ల కొనుగోలుదారులు హెచ్‌ఎండీఏ కార్యాలయానికి రాకుండానే ఈ -వేలం/ఈ- టెండర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానాన్ని ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ -వేలం నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఆడిషనల్ జనరల్ మేనేజర్ రేణు పురుషోత్తం (88844 06412)ను సంప్రదించవచ్చన్నారు. అంతేకాకుండా ఎంఎస్‌టీసీ కార్యాలయం 040-23301049, 040-23301039 నంబర్లపై కూడా సంప్రదించవచ్చు. ఈ -వేలంలో పాల్గొనదలిచిన కొనుగోలుదారులు ముందుగా వెబ్‌సైట్‌లో పొందుపర్చిన బయ్యర్ (కొనుగోలుదారులు) రిజిస్ట్రేషన్ మాన్యువల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వేలం ప్రక్రియపై సందేహాలుంటే సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో ఓఆర్‌ఆర్ పీడీ ఆశోక్ కుమార్, ఈఓ గంగాధర్, సీఏఓ శరత్ చంద్ర, సీపీఓ, డైరెక్టర్ నరేంద్ర, ఈఈ యూసుఫ్ హుస్సేన్, ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, డీఏఓ సరస్వతి, పీఆర్వో విజిత తదితరులు పాల్గొన్నారు.

196

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles