గుర్రపు డెక్క..చక చకా

Tue,March 26, 2019 02:35 AM

బడంగ్‌పేట,(నమస్తే తెలంగాణ): చెరువులోకి డ్రైనేజీ వాటర్ రా కుండా ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తేనే గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. బాలాపూర్ మండలం జిల్లెలగూడ మున్సి పాలిటీ పరిధిలో ఉన్న సందచెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే ప్లోటింగ్ క్రాష్ కలెక్టర్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎండీఎ పరిధిలో ఉన్న 20 చెరువులను అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. జిల్లెల గూడ సందచెరువులోకి డ్రైనేజీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని డ్రైనేజీ మళ్లించే ప్రయత్నం చేస్తామన్నారు. గుర్రపు డెక్కను తొలగించడానికి ఐదు ప్లోటింగ్ క్రాష్ కలెక్టర్లను కొనుగోలు చేశామన్నారు. ఒక్కో మిషన్‌కు రూ. 1.50 కోట్లు ఉంటుం దన్నారు. 30 ఎకరాలలో ఉన్న గుర్రపు డెక్క ను తొలగించడానికి 25 రోజులు పడుతుంద న్నారు. ఎఫ్‌టిఎల్ లోపల ఎవరైనా కబ్జాలు చేసిన్నట్లు తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.నిర్మాణాలను తొలగిస్తామన్నారు. చెరువులలోకి మురుగు నీరు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఇ డిఎల్‌ఎన్ రెడ్డి, ఫారెస్టు అధికారి శ్రీనివాస్, ఎస్‌ఇ మాజీద్ శరీఫ్,ఎస్‌ఇ అరుణ్ జ్యోతి, ఇఇ చంద్రశేఖర్, రామ కృష్ణ, జిల్లెలగూడ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి, మీర్‌పేట మున్సిపాలిటీ కమిషనర్ వసంత, మేనేజర్స్ చం ద్రశేఖర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఎఇ ఆర్ రాంమోహన్,వివిధ విభాగాల అధికారులు తదితరులు ఉన్నారు.

170

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles