మన కూరగాయలు భేష్

Mon,March 25, 2019 03:15 AM

- ఇప్పటికే 60 కేంద్రాలు
- త్వరలోనే మరో వంద సెంటర్ల ఏర్పాటు
- వారంతపు సంతల్లోనూ ఔట్‌లెట్లు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన కూరగాయలు కేంద్రాలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నది. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో మార్కెటింగ్ శాఖ నగరంలో 60కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. త్వరలోనే వీటిని వందకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే వారాంతపు సంతల్లోనూ మన కూరగాయలు ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తుండడంతో అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. మార్కెటింగ్ శాఖ అధికారుల మార్గదర్శకాల ప్రకారం ప్రతి దుకాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో కూరగాయలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్, విద్యుత్, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది.

వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించడంతో పాటు రైతులు పం డించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కూరగాయల పథకాన్ని తీసుకొచ్చింది. సదరు పథకానికి రోజురోజూకీ వినియోగదారులనుంచి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా 60 కి పైగా మన కూరగాయల ఔట్‌లెట్లను మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. తాజా కూరగాయలు దొరకడంతో పాటు తక్కువ ధరకు లభించడం, తూకంలో ఏలాంటి తేడా లు లేకపోవడం వంటి కారణాల వల్ల నగరవాసులు మన కూరగాయలు కేంద్రాల వైపు మక్కువ చూపుతున్నారు. నగరవ్యాప్తంగా వీటికి ఆదరణ పెరగడంతో త్వరలోనే వీటిని వందకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వారంతపు సంతలు ఉండడం వాటికీ వినియోగదారుల ఆదరణ ఉన్నప్పటికీ నాణ్యమైన కూరగాయలు అందుబాటులో లేకపోవడం, తూకాలు, కొలతల్లో పెద్ద ఎత్తున తేడాలు ఉండడంతో వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా వారాంతపు సంతల్లో కూడా మన కూరగాయలు ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తుండడంతో అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా వారాంతపు సంతల్లో కూడా మన కూరగాయలు ఔట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వారంతపు సంతలు ఎక్కడ అధికంగా ఉన్నాయి? వాటి ద్వారా ఎంత మొత్తం ఆదాయం వస్తుంది. వాటిని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు.

స్వయం ఉపాధి కల్పన దిశగా..
అంతేకాకుండా స్వయం ఉపాధి పథకం ద్వారా నేటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో అధికారులు ఉన్నారు. ఎవరైనా మన కూరగాయలు ఔట్‌లెట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చినా అటువంటి వారికి కొంత శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారు లు మార్గదర్శకాల ప్రకారం ప్రతి దుకాణానికి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఇందు లో కూరగాయలను నిల్వ చేసేందుకు చిన్నపాటి కోల్డ్ స్టో రేజ్, విద్యుత్, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. దుకాణ నిర్వాహకులు నామమాత్రపు లాభాలకే కూరగాయలను అమ్మకాలు జరపాలి.

కరివేపాకు నుంచి పుచ్చకాయ వరకు అన్ని రకాల కూరగాయలు, పండ్లు మన కూరగాయలు కేంద్రంలో ఒకేచోట తక్కువ ధరకు లభిస్తున్నాయి. వీటికి డిమాండ్ పెరగడంతో జిల్లాలకు కూడా పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా ఈ పథకం వినియోగదారులకే కాకుండా ఇటు రైతులు.. అటు వ్యాపారులకు లాభదాయకంగా ఉండడంతో విజయవంతమయ్యిం ది. సిటీలో ఔట్‌లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2017, ఆగస్టులో 47 కేంద్రాలు ఉంటే.. ప్రస్తుతం అవి 60 కేంద్రాలకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ కాలనీల్లోనూ ఔట్‌లెట్లను ఏర్పాటు చేశారు.

నగర శివారు జిల్లాల నుంచి..
బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా మన కూరగాయలు ప్రాజెక్టు పనిచేస్తోంది. ఈ మార్కెట్ యార్డుకు రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూరగాయలను తెప్పిస్తున్నారు. వీటికి సంబంధించి నాణ్యత, వేయిం గ్, ప్యాకింగ్ వంటి వాటిని ఇక్కడ చేపట్టడమే కాకుండా ఇక్కడ్నుంచే నగరంలోని అన్ని మన కూరగాయల స్టాల్స్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 60 స్టాల్స్ కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను వందకు పెంచుతామన్నారు. ప్రస్తుతం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 21 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే రోజు నగరానికి తాజా కూరగాయలను సరఫరా చేస్తున్నారు. కలెక్షన్ సెంటర్లలో రైతుల ద్వారా కూరగాయలను సేకరిస్తారు. ఇక్కడ నుంచి ప్రధాన కేంద్రమైన బోయిన్‌పల్లికి వీటినితరలించి, నాణ్యత, ప్యాకింగ్‌ను చేసి ఔట్‌లెట్స్‌కు సరఫరా చేసేందుకు సిద్దంగా ఉంచుతారు. కూరగాయలతో పాటు వంట నూనెలు అమ్ముకునే వీలు కల్పిస్తారు. వంటనూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తులు, బ్రెడ్, కోడిగుడ్లు వంటివి కూడా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తారు. వీటితో పాటు గిరిజన ఉత్పత్తులను సైతం విక్రయించుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. కలెక్షన్ సెంటర్‌లో కూరగాయలు లేకపోతే బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి బోయిన్‌పల్లి మార్కెట్‌కు తరలిస్తారు.

447

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles