41.76 లక్షలకు చేరిన జిల్లా ఓటర్లు

Fri,February 22, 2019 01:20 AM

-జిల్లాలో 1.1లక్షల పెరుగుదల
-నేడు తుది జాబితా విడుదల
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ జిల్లాలోని 15అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 1.1లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారు. దీంతో జిల్లా ఓటర్ల సంఖ్య 4176363కు చేరింది. శుక్రవారం ఓటర్ల తుదిజాబితాను విడుదలచేయనున్నారు. అయినా, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేవరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుంది. వీరికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తారు.అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ కార్యక్షికమాన్ని చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారులు గత ఏడాది డిసెంబర్ 26న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదలచేశారు. ఇందులో 2110364మంది పురుషులు, 194670మంది మహిళలు, 344మంది థర్డ్ జండర్లు కలుపుకొని మొత్తం 40574మంది ఓటర్లున్నారు. కాగా, సవరణ కార్యక్షికమంలో భాగంగా ఫిబ్రవరి నాలుగవ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించి అం దులో అర్హతగలవాటికి ఈనెల 22న విడుదలచేస్తున్న ఓటర్ల తుదిజాబితాలో చోటు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఓటు నమోదుకోసం 17737 ఫామ్-6 దరఖాస్తులు రాగా, అందులో 16555దరఖాస్తులకు జాబితాలో చోటు లభించింది. 1129దరఖాస్తులను తిరస్కరించారు. అలాగే, కొత్తగా 291ఎన్‌ఆర్‌ఐ ఓట్లు కూడా నమోదయ్యాయి. కాగా, ఫామ్-7 దరఖాస్తుల ప్రకారం 46974ఓటర్ల తొలగించారు. దీంతో కొత్త ఓటర్ల సంఖ్య 4176363కు చేరింది. ఈనెల 22న శుక్రవారం ఓటర్ల తుదిజాబితాను విడుదలచేస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణ వివరాలు.....
దరఖాస్తు రకం వచ్చినవి ఆమోదం తిరస్కరణ
ఫామ్-6(కొత్త ఓటర్లు) 17737 16555 1129
ఫామ్-6ఏ(ఎన్‌ఆర్‌ఐ) 472 291 11
ఫామ్-7(తొలగింపు) 50419 46974 3445
ఫామ్-(సవరణలు) 42052 3503 6969
ఫామ్-ఏ(చిరునామా మార్పు) 75975 7439 1556
మొత్తం 346305 322295 24010
డిసెంబర్ 26న విడుదలచేసిన ఓటర్ల ముసాయిదా ప్రకారం ఓటర్ల వివరాలు....
పురుషులు- 2110364
మహిళలు- 194670
థర్డ్ జండర్- 344
మొత్తం- 40574

302

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles