సేఫ్ సిటీకి అందరూ కలిసి పని చేయాలి


Fri,February 22, 2019 01:19 AM

-172 మంది క్రిమినల్స్ సమాచారం మార్పిడి
-సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక కార్యాచరణ
-ట్రై పోలీస్ కమిషనరేట్ల సమన్వయ సమావేశం
-సరిహద్దు పోలీసులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్
సిటీబ్యూరో/బండ్లగూడ, నమస్తే తెలంగాణ : క్రిమినల్స్ నక్కజిత్తుల ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పోలీస్ కమిషనరేట్‌ల సరిహద్దులపై దృష్టి సారించారు. చోరీలకు పాల్పడే దొంగలు, రౌడీషీటర్లు, భూకబ్జాదారుల సమాచారాన్ని పకడ్బందీగా భద్రపరుస్తున్నారు. చాలా మంది నేరస్తులు వారు నివాసం ఉండే పీఎస్ పరిధిల్లో కాకుండా వాటి సరిహద్దు పోలీసు స్టేషన్ పరిధి ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో వారిపై స్థానిక పోలీసుల నిఘా సన్నగిల్లే విధంగా నేరగాళ్లు స్కెచ్‌లు వేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఛాన్స్‌గా తీసుకుని నేరస్తులు శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. ఈ కారణంగా సంఘటనలు జరిగినప్పుడు నేర ప్రక్రియను పరిశీలించిన అధికారులకు పక్క పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసులు ఉన్నా సమాచారం అందడం ఆలస్యమవుతుంది. పలు దర్యాప్తుల్లో ఈ అంశాలు బయటపడడంతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమన్వయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న మూడు పోలీసు కమిషనరేట్ల సరిహద్దు పోలీసులకు పరిమితులను తొలిగించి సిటీ సేఫ్‌కు అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని ఓ ప్రత్యేక ప్రక్రియను రూపొందించారు. దీని కోసం గురువారం రాజేంవూదనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ జోన్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ జోన్‌లో ఉంటూ రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో 10 మంది రౌడీ షీటర్లు కార్యకలాపాలు, ఆ పరిధికి చెందిన 15 మంది రౌడీషీటర్లు సైబరాబాద్ పరిధిలో చేస్తున్న దందాలు వారి ఫొటోలు, వివరాలను మార్చుకున్నారు. చోరీలకు పాల్పడుతున్న హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 100మంది సైబరాబాద్ పరిధిలో నేరాలకు పాల్పడుతుండగా, సైబరాబాద్‌కు చెందిన 30 మంది నేరస్తులు ఆ కమిషనరేట్ పరిధిల్లో నేరాలకు పాల్పడుతున్న డేటా వారి ఫొటోలు, నేర ప్రక్రియ సమాచారాన్ని మార్చుకున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో పీడీ యాక్ట్ కింద నమోదైన 16 నేరస్తులకు కేసుల విచారణ దశల గురించి కూడా చర్చించారు. దీంతోపాటు మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో కొనసాగే భారీ ర్యాలీలు, ఉత్సవాలు కొనసాగే మార్గాలు, అక్కడ ఉండే సమస్యాత్మ, సున్నితమైన ప్రాంతాల వివరాలను కూడా సరిహద్దు అధికారులు మార్పిడి చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ శంషాబాద్ డీసీపీ జోన్‌కు రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని ఎల్బీనగర్ జోన్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన దక్షిణ మండలం సరిహద్దుగా ఉంది. ఇక మాదాపూర్ జోన్‌కు వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, సంగాడ్డి జిల్లా ఎస్పీల పరిధి సరిహద్దుగా ఉందని సీపీ వివరించారు. ఈ సమన్వయ సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌డ్డి, దక్షిణ మండలం డీసీపీ అంబర్‌కిశోర్‌ఝా, ట్రై పోలీసు కమిషనరేట్‌ల సరిహద్దు పోలీస్‌స్టేషన్ అధికారులు పాల్గొన్నారు

726

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles