తెలంగాణ జువైనల్ హోంలు దేశంలోనే బెస్ట్


Fri,February 22, 2019 01:19 AM

- ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో చిన్నారులకు మెరుగైన వసతులు
- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆనంద్
సైదాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణలో దేశంలో ఎక్కడాలేని విధంగా బాలుర సదనాలు(జువైనల్ హోం)లు ఉన్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్.జి.ఆనంద్ అన్నారు. గురువారం సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర సదనాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు కల్పిస్తున్న వసతులు, భోజనాలు, పరిసరాల పరిశువూభత బాగున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, నిర్ధిష్టమైన లక్ష్యంతో కృషి చేస్తుందని ఆయన ప్రశంసించారు. రిస్కీహోంలు, బాలుర, బాలిక సదనాల్లో ఆశ్రమం పొందుతున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తుందని కొనియాడారు. రంగాడ్డి జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో కోళ్లఫారాల్లో చిన్నారులతో యజమానులు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని గుర్తించి బాల కార్మికులను విముక్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


ఇటీవల ఇటుక బట్టీల్లో బాల కార్మికులతో పనులను చేయించుకుంటున్న సుమారు వంద మంది చిన్నారులకు అధికారులు విముక్తి కల్పించారని, వారందరూ సైదాబాద్, నింబోలి అడ్డ సదనాల్లో ఉన్నారని తెలిసి ఇక్కడి వచ్చామన్నారు.
ఒడిశా నుంచి చిన్నారులను కొంతమంది దళారీలు ఇక్కడికి తీసుకుని వచ్చి వారితో ఇటుక బట్టీలు, కోళ్లఫారాల్లో పని చేయించుకుంటున్నారనే సమాచారం ఉందని, వాటిపై నిఘా పెట్టి దళారీలను గుర్తించే పని మొదలు పెట్టామని, త్వరలోనే కోళ్లఫారాలపై దాడులు చేసి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. చైల్డ్ లైన్ ద్వారా అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నారని, ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వేగంగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. బాలుర సదనంలో చిన్నారులకు అందిస్తున్న విద్య, ఆహార వంటి విషయాలను ఆయన సైదాబాద్ ప్రభుత్వ బాలుర సదనం పర్యవేక్షణ అధికారి బి. నీలకం ఉప పర్యవేక్షణాధికారి ఎన్.నాగేశ్వరరావులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సక్కుబాయి, రంగాడ్డి జిల్లా చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు నారా నాగేశ్వరరావు, బచ్‌ఫన్ బచావో రాష్ట్ర కోఆర్డినేటర్ దేవయ్య, స్పందన చైల్డ్ లైన్ ఇన్‌చార్జి శోభారాణి, రంగాడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీవోఐసీ లావణ్యడ్డి పాల్గొన్నారు.

403

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles