చీటింగ్ కేసులో ఇద్దరు నీటిపారుదలశాఖ ఉద్యోగుల అరెస్ట్


Fri,February 22, 2019 01:19 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టించిన కేసులో నిందితులకు సహకరించిన ఇద్దరు నీటి పారుదలశాఖ ఉద్యోగులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ భరత్‌భూషణ్ కథనం ప్రకారం..యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉంటున్న ఇమానుద్దీన్‌తో పాటు పలువురు నిరుద్యోగులకు నీటి పారుదలశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 2017లో సాయికుమార్, సర్వర్, ధన్‌రాజ్‌లు నమ్మించారు. వీరి మాటలు నమ్మిన 12మంది రూ.20లక్షల మేర డబ్బులు చెల్లించారు. నెలలు గడిచిన తర్వాత నియామకపవూతాలు అంటూ బోగస్ పత్రాలను అందజేసి.. సాయికుమార్ తదితరులు ఉడాయించారు. ఈ నియామకపవూతాలు బోగస్‌వి అని ఆ శాఖ అధికారులు తేల్చిచెప్పడంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా... ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయికుమార్‌కు బాబాయ్ అయ్యే ఇగడ వేణుగోపాల్ (50) ఎర్రమంజిల్‌లోని నీటిపారుదలశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. బోగస్ నియామకపవూతాలను తయారు చేయడంలో వేణుగోపాల్‌తో పాటు అదేశాఖలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న ఎం ఇద్దరు వ్యక్తులు సాయికుమార్‌కు సాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో వీరిద్దరి పాత్రపై పక్కా ఆధారాలు లభించడంతో గురువారం వేణుగోపాల్, వెంక అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ చీటింగ్‌కు పాల్పడినందుకు వేణుగోపాల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

332

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles