అక్బర్‌నగర్ నాలాపైబ్రిడ్జి నిర్మాణం


Fri,February 22, 2019 01:18 AM

-దశాబ్దాల కల నెరవేరుతున్న వైనం
-వాహనదారులకు తప్పనున్న తిప్పలు
-హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి, 21 (నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని లలితాబాగ్ డివిజన్ పరిధిలోని అక్బర్‌నగర్ బస్తీలోని నాలా రూపురేఖలు మారుతున్నాయి. రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణలో అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. అయితే కాళీకానగర్ మీదుగా ఈదీబజార్ వైపు రాకపోకలు సాగించే క్రమంలో రోడ్డు మార్గం మధ్యలో నల్లవాగు నాలా ప్రవహిస్తుంది. గతంలో ఈ నాలాపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం, భయ్యాలాల్‌నగర్, అక్బర్‌నగర్ మీదుగా యాకుత్‌పురా వైపు నాలా ప్రవహించే దారిలో నాలాకు ఇరువైపులా కొన్నిచోట్ల ప్రహరీ నిర్మాణం లేకపోవడంతో వర్షకాలంలో తరుచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల అవస్థలను గుర్తించిన అధికారులు నాలాపై కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు ఇటీవల రూ.10 కోట్లు మంజూరు చేశారు. దీంతో వారం రోజులుగా పనులు శరవేగంగా కొనసాగుతుండగా రెండు నెలల్లో పూర్తై ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే వర్షకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నాలా అభివృద్ధి పనులు కొనసాగుతుండడంగా సమీపంలో ఉన్న మరో బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు.

268

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles