కొంప ముంచు ఈ యాప్

Wed,February 20, 2019 12:50 AM

-గొట్టిముక్కుల సుధాకర్ గౌడ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) యాప్‌ల లావాదేవిలు పెరుగడంతో సైబర్ నేరగాళ్లు వీటిపై దృష్టి సారించారు. సైబర్ నేరాలను గుర్తించిన ఆర్‌బీఐ.. ఖాతాదారులను అప్రమత్తం చేయాలని బ్యాంక్ అధికారులకు సూచలను జారీ చేసింది. మరో వైపు సైబర్ క్రైం పోలీసులూ దీనిపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.

మీ ఫోన్ వారి కంట్రోల్‌లోకి..
సైబర్ క్రిమినల్స్ ఎనీ డెస్క్ యాప్‌ను ప్లే స్టోర్, గూగుల్ ప్లే నుంచి డౌన్‌లోడ్ చేయించి మీ ఫోన్‌ను వారి కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత మీ యూపీఐ యాప్‌లతో అనుసంధానమైన బ్యాంక్‌ల నుంచి సొమ్మును కాజేస్తారు. అంతేకాకుండా ఫోన్ వారి కంట్రోల్‌కు వెళ్లగానే మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంట్నట్ బ్యాంకింగ్‌ల సమాచారం వారికి చిక్కుతుంది.

యూపీఐ యాప్ లావాదేవీలను మరింత వేగవంతంగా కొనసాగేలా చూస్తామని నమ్మిస్తారు సైబర్ నేరగాళ్లు. మీరు ముందుగా గూగుల్ ప్లే, ప్లే స్టోర్ నుంచి ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతారు. మరో సారి ఫోన్ చేసి మీరు ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా మీకు వచ్చిన 9 అంకెల యూజర్ నంబర్ చెప్పాలని అడుగుతాడు. ఈ నంబర్‌ను అతడు ఎనీ డెస్క్ యాప్‌లో ఎంట్రీ చేసుకోగానే ఆటోమెటిక్‌గా మీ ఫోన్ పూర్తిగా అతడి కంట్రోల్‌కు వెళుతుంది. మరిన్ని వివరాలు కావాలని మభ్యపెట్టి మీ యూపీఐ యాప్‌ల యూజర్ ఐడీ, పాస్‌వర్డు, పిన్ నంబర్లను సేకరిస్తాడు. ఒక వేళ మనం చెప్పకపోయినా ఎనీ డెస్క్ యాప్‌తో మీ ఫోన్‌లో జరుగుతున్న ప్రతీ వ్యవహారం అతడికి చేరుతుంది.

రూ. 7.36 లక్షలు టోకరా
ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ధీరజ్ కుమార్ (పేరు మార్చాం) ఓ బ్యాంక్‌లో రుణం తీసుకున్నాడు. దాన్ని ప్రీ క్లోజర్ (ముందస్తు చెల్లింపు) గా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకుని ఓ అపరిచిత వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీరు రుణాన్ని ముందస్తుగా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారు కదా ఆ విషయంలో మీకు సాయ పడేందుకు ఫోన్ చేశానని పరిచయం చేసుకున్నాడు. ముందుగా మీరు ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు. అతడిని నమ్మి ధీరజ్ కుమార్ మోసపోయాడు. బ్యాంక్ యాప్‌ల నుంచి దాదాపు 7.36 లక్షలు ఇతర ఖాతాలను వెళ్లినట్లు మెసేజ్‌లు రావడంతో కంగుతిన్నాడు. ఈ కేసును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

470

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles