ఔటర్‌ను మరింత హరితవనం చేయాలి

Wed,February 20, 2019 12:45 AM

-నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
-సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ హెచ్చరిక
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్ రింగు రోడ్డులో పచ్చదనం పెంపునకు మరింత కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుద్ధపూర్ణిమ కార్యాలయంలో మంగళవారం ఔటర్ రింగు రోడ్డు నిర్వహణపై అధికారులతో కలిసి అరవింద్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శంషాబాద్ విమానాక్షిశయానికి వెళ్లే రహదారిపై మరింత పచ్చదనం పెంచాలని, అందుకు అవసరమైన హెడ్జ్ కటింగ్ మిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పచ్చదనం పెంపులో అవసరమైన సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు.

పచ్చదనంతోపాటు ఔటర్‌కు ఇరువైపులా పరిశువూభతకు కూడా పెద్దపీట వేయాలన్నారు. ముఖ్యంగా టోల్ రుసుం వసూలు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మరింత పచ్చదనం పెంచాలని, విరివిగా మొక్కల పెంపకం చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్నారు. ఔటర్‌లో తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, పరిశువూభత పాటించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటిన మొక్కలు చనిపోకుండా సమయానుసారంగా నీరు పోయాలని ఆదేశించారు. సెంట్రల్ మీడియన్లలోని మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి యాత్రీకులను ఆకట్టుకునేట్లు పలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్, ఔటర్ సీజీఎం ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక కేంద్రం
వారసత్వ సంపదను కాపాడేందుకు చేపట్టబోయే పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నాయకత్వంలో మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన సమీక్షించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు గడియారాలకు మరమ్మతులు చేసి పునరుద్దరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మానిటరింగ్ యూనిట్‌లో ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీర్లతోపాటు ప్లానింగ్ విభాగం అధికారులను భాగస్వాములను చేయాలని చెప్పారు. వారసత్వ సంపద కాపాడేందుకు ఏర్పాటు చేసే మానిటరింగ్ యూనిట్‌కు ఆర్థిక లావాదేవీలు, పాలనాపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అవసరమైన అధికారాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషరఫ్, చీఫ్ ఇంజినీర్ జియావుద్ధీన్, శ్రీధర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌డ్డి తదితరులు పాల్గొన్నారు.

196

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles