కొత్త రోడ్లు, పైవంతెనలతో..సాఫీగా ప్రయాణం


Tue,February 19, 2019 12:28 AM

-ఎస్‌ఆర్‌డీపీతో మెరుగైన ఫలితాలు
-మైండ్‌స్పేస్ జంక్షన్‌లో సునాయాసంగా ప్రయాణం
-ఎల్బీనగర్‌లోనూ ఉపశమనం
-వాహనాలు పెరిగినా ఇబ్బందుల్లేవు
-ట్రాఫిక్‌పై బల్దియా అధ్యయనం
-మిగిలిన ప్రాజెక్టులు పూర్తయితే మరింత వెసులుబాటు
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ:రానున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టుతో మెరుగైన ఫలితాలొస్తున్నాయి. ఇప్పటికే మూడు అండర్‌పాస్‌లు, రెండు ైఫ్లెఓవర్లు ప్రారంభం కాగా, అవి అందుబాటులోకొచ్చిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఎంతో ఉపశమనం లభించింది. దీనికితోడు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల కారణంగా గతంలోకన్నా ఈ మార్గాల్లో వాహనాల ప్రయాణం అధికమైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు.


ప్రాథమిక నివేదిక ప్రకారం..
ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో మొదటిదశలో ఎల్బీనగర్, హైటెక్‌సిటీ తదితర రెండు ప్రధాన కారిడార్లలో ైఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. ఇందులో హైటెక్‌సిటీ కారిడార్‌లో అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్ జంక్షన్‌ల్లో అండర్‌పాస్‌లతోపాటు మైండ్‌స్పేస్ జంక్షన్‌లో ైఫ్లెఓవర్ అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఎల్బీనగర్ కారిడార్‌లో చింతలకుంట అండర్‌పాస్‌తో పాటు కామినేని హాస్పిటల్ ఎడమ ైఫ్లెఓవర్ నిర్మాణం పూర్తయింది. కాగా, ఎల్బీనగర్ ైఫ్లెఓవర్‌తో పాటు హైటెక్‌సిటీ కారిడార్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం ైఫ్లెఓవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ైఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లతో ఏ మేరకు ఉపయోగం చేకూరిందనే దానిపై జీహెచ్‌ఎంసీ దృష్టి కేంద్రీకరించింది. ట్రాఫిక్‌పై అధ్యయనం చేసింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టులు నిర్మించే నాటికి ఉన్న ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు వ్యత్యాసం ఉందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న వాహనాలతో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆయా జంక్షన్ల నుంచి ప్రయాణించే వాహనాలు కూడా ఎక్కువైనట్లు వారు పేర్కొంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాహనాలు పెరిగినా.. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి.

మైండ్‌స్పేస్ జంక్షన్‌లో..
మైండ్‌స్పేస్ జంక్షన్ ైఫ్లెఓవర్ విషయానికొస్తే, ఇనార్బిట్ మాల్ నుంచి ఐకియా వైపు 830 మీటర్ల పొడవు నాలుగు లేన్ల ైఫ్లెఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారమైంది. రూ. 48.06కోట్లతో దీన్ని నిర్మించారు. దీంతో మైండ్‌స్పేస్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఎంతో వెసులుబాటు కలిగింది. ఈ జంక్షన్‌లో ప్రతి గంటకు ైఫ్లెఓవర్ నిర్మించే నాటికి ప్రతి గంటకు 14400 వాహనాలు ప్రయాణం సాగిస్తుండగా, 2035 నాటికి గంటకు 31356 వాహనాలకు చేరుతుందని అంచనా. కాగా, ైఫ్లెఓవర్ నిర్మాణం పూర్తయ్యాక ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య దాదాపు 20వేలకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ైఫ్లెఓవర్‌తో ఇనార్బిట్ మాల్ నుంచి ర్యాడిసన్ వైపు అలాగే, ర్యాడిసన్ నుంచి ఇనార్బిట్ వైపు వాహనాలు ఆగకుండా ప్రయాణం సాగించేందుకు ఆస్కారం ఏర్పడింది.

సునాయాసంగా రాకపోకలు...
హైటెక్‌సిటీ కారిడార్‌లో భాగంగా, నాలుగు జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం చేపట్టారు. బయోడైవర్శిటీ, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ విగ్రహం తదితర నాలుగు జంక్షన్లను కలుపుతూ దీన్ని రూపొందించారు. దీంతోపాటు ప్రస్తుత రోడ్డును విస్తరిస్తున్నారు. ఈపీసీ పద్ధతిలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కారిడార్‌లో అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్ జంక్షన్లలో అండర్‌పాస్‌లు, మైండ్‌స్పేస్ జంక్షన్‌లో ైఫ్లెఓవర్ నిర్మాణం పూర్తయింది. మైండ్‌స్పేస్ జంక్షన్‌లో బయోడైవర్సిటీ పార్కు నుంచి సైబర్ టవర్ మార్గంలో ఇరువైపులా రాకపోకలకు ఆరులేన్ల అండర్‌పాస్ నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య చాలావరకు పరిష్కారమైంది. 365 మీటర్ల పొడవైన ఈ అండర్‌పాస్‌ను రూ. 25.78కోట్లతో నిర్మించారు.

ఎల్బీనగర్ ప్రాంతంలోనూ ఊరట...
ఇక ఎల్బీనగర్ కారిడార్‌లో భాగంగా రూ. 12.70కోట్ల వ్యయంతో చింతలకుంట అండర్‌పాస్‌ను నిర్మించారు. దీంతో విజయవాడ హైవేపై బైరామల్‌గూడ వైపు నుంచి చింతలకుంట వైపు ట్రాఫిక్ ఆగకుండా ప్రయాణం సాగించే వీలు కలిగింది. ముఖ్యంగా, దీనివల్ల విజయవాడ హైవే నుంచి సాగర్‌రోడ్డుకు, అలాగే సాగర్ రింగురోడ్డు నుంచి నుంచి విజయవాడ హైవేకు ట్రాఫిక్ నేరుగా వెళ్లే వీలు కలిగింది. ఈ కారిడార్‌లో భాగమైన కామినేని ఎడమ వైపు ైఫ్లెఓవర్‌ను గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. రూ. 49కోట్లతో రూ. 940 మీటర్ల పొడవున నిర్మించిన ఈ మూడు లేన్ల ైఫ్లెఓవర్‌తో శ్రీశైలం, విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రాఫిక్‌కు ఎంతో మేలు కలుగుతున్నది. అలాగే, ఎల్బీనగర్ కుడివైపు ైఫ్లెఓవర్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా పూర్తయితే ఈ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

1708

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles