ఒంటరి మహిళలే టార్గెట్


Sun,January 20, 2019 12:23 AM

-దాడిచేసి ఆభరణాలు అపహరణ... ఇద్దరు నిందితులు అరెస్ట్
-మరో ఇద్దరు బాలలు జువైనల్ హోంకు
-14 తులాల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం
మన్సూరాబాద్ : కాలనీల్లో ఒంటరి మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకొని దోచుకుంటున్న పాత నేరస్తుడితోపాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అలాగే ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంకు చెందిన గడల మహేశ్ (24) నాగోల్, బండ్లగూడ, ఆనంద్ నివాసముంటూ ఎల్బీనగర్, రాక్ హెయిర్ కటింగ్ షాపు నడుపుతున్నాడు. అలాగే మన్సూరాబాద్, భరత్ కాలనీకి చెందిన బొడ్డు మహేశ్ బాబు (23) నిస్సాన్ కారు షోరూంలో అడ్వైజర్ పని చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు. వీరికి నాగోల్, సాయినగర్ చెందిన మరో ఇద్దరు బాలలతో స్నేహం ఉంది. ఈ నలుగురు మద్యం, గంజాయికి అలవాటుపడి జల్సాలు చేయడం ప్రారంభించారు. ఇందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాల ని పథకం పన్నారు. ఇందులో భాగంగా పలు దొంగతనాల కేసుల్లోగడల మహేశ్ జైలుకు వెళ్లగా, ఇద్దరు మైనర్లు జువైనల్ హోంకు వెళ్లారు. తిరిగి విడుదలైన తర్వాత దొంగతనాలు చేయడం ప్రారంభించారు.


గడల మహేశ్.. షాపులో తీరిక దొరికినప్పుడు బైకుపై పరిసర కాలనీల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను గమనిస్తాడు. అనంతరం ముఖానికి మాస్క్ వేసుకుని మహిళలు, వృద్ధులపై దాడికి దిగి బంగారు ఆభరణాలు దోచుకుంటాడు. బయట ఇద్దరు మైనర్లు గమనిస్తుంటారు. దోచుకున్న సొమ్మును బొడ్డు మహేశ్ కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎల్బీనగర్ కాకతీయకాలనీ, సాయినగర్, లలితానగర్ మహిళలపై దాడులు చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. తిరిగి ఈనెల 13న రాక్ ఒంటరిగా ఉన్న అలూరి స్వర్ణలత (72) అనే వృద్ధురాలిని తీవ్రం గా కొట్టి ఆమెపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా గడల మహేశ్, ఇద్దరు మైనర్లను శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో బొడ్డు మహేశ్ భరత్ అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో డీసీపీ క్రైమ్స్ కేఆర్ నాగరాజు, ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్ సీఐ అశోక్ డీఐ కృష్ణమోహన్, క్రైమ్ ఎస్సై మారయ్య పాల్గొన్నారు.

406

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles