వెళ్లిన ట్రాక్ నుంచే.. మళ్లీ వెనక్కి


Thu,January 17, 2019 01:31 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఈ నెలాఖరుకు హైటెక్‌సిటీ వరకు మెట్రోరైలు అందుబాటులోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కారిడార్‌లోని అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల పది కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నది. ఈ విషయాన్ని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కారిడార్-3కి సంబంధించి ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు రాకపోకలు సాగుతున్నది. ఈ కారిడార్‌లో పెండింగ్‌లో ఉన్న అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ట్రయల్న్ నడుస్తున్నది. మెట్రోరైలు ప్రారంభమై సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా హైటెక్‌సిటీ మార్గంలో ట్రయల్న్‌క్రు శ్రీకారం చుట్టారు. ఆరు నిమిషాలకో రైలు ప్రయాణించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాలా రోజులుగా ఐటీ ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడెప్పుడు హైటెక్‌సిటీ వరకు మెట్రో వస్తుందని ఆసక్తిగా చూస్తున్నారు. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైతే నాగోల్ నుంచి సైబర్ టవర్స్ వరకు రాకపోకలు సాగుతాయి. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ట్విన్ సింగిల్‌లైన్ విధానంలో ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల మెట్రోరైలు ఒకే లైను నుంచి వెళ్లి అదేలైను మీదుగా వెనుకకు ప్రయాణిస్తుంది. రెండు లైన్లు సిద్ధమైనప్పటికీ, రెండు లైన్లపై రాకపోకలు ఒకే డైరెక్షన్‌లో సాగుతాయి. హైటెక్‌సిటీ వద్ద మరో ట్రాక్‌పై మళ్లే సౌకర్యం లేకపోవడంతో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. సిగ్నలింగ్ సిస్టమ్స్‌లో సీబీటీసీ(కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్) విధానం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో పకడ్బందీగా పనిచేస్తుంది.


10 కిలోమీటర్లు..8 స్టేషన్లు..
ప్రస్తుతం ట్రయల్న్ నిర్వహిస్తున్న 10 కిలోమీటర్ల మార్గంలో ఎనిమిది స్టేషన్ల వివరాలివి..
- మధురానగర్
- యూసుఫ్‌గూడ
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్. 05
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
- పెద్దమ్మగుడి
- మాదాపూర్
- దుర్గంచెరువు
- హైటెక్‌సిటీ

760

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles