పట్నమంతా.. పల్లెకు పయనం

Mon,January 14, 2019 01:11 AM

-సంక్రాంతి పండుగతో నగరం ఖాళీ
- తగ్గిన ట్రాఫిక్ రద్దీ.. నిర్మానుష్యంగా రోడ్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సంక్రాంతికి పట్నం పల్లె బాట పట్టింది. తట్టా బుట్టా సర్దుకుని, పిల్లా పాపలను వెంటేసుకుని ఊరిబాట పడుతున్నది. సీట్లు దొరకకున్నా.. బస్సులు లేకున్నా.. రైళ్లన్నీ రద్దీని తలపిస్తున్నా.. సొంతూర్లకు ప్రయాణమవుతున్నారు. పండుగకు ముందు రెండో శనివారం, ఆదివారం కలిసిరావడం, సోమ, మంగళవారాల్లో సెలవులు కావడంతో జనమంతా ముందుగానే ఊర్లకు పయనమయ్యారు.

సగం ఖాళీ..

నాలుగైదు రోజుల నుంచి నగరవాసి ఊరిబాట పడుతుండడంతో నగరం ఖాళీ అవుతుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకప్పటి రద్దీ ప్రస్తుతం కనిపించడం లేదు. రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నాంపల్లి, లక్డీకాపూల్, అబిడ్స్, హియాయత్ కూకట్ బేగంపేట, అమీర్ ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిమిషం కూడా ఖాళీగా కనపించని జూబ్లీహిల్స్ చెక్ సందడి కనిపించకపోవడం గమనార్హం. హైటెక్ సిటీ జంక్షన్, బషీర్ జనసందోహం లేక ఆయా ప్రాంతాల్లో, రహదారుల్లో నిర్మానుష్య వాతావరణంగా మా రింది. రద్దీ లేకపోవడం సిటీ బస్సులను జిల్లాలకు నడిపిస్తున్నారు. కోదాడ, ఖమ్మం, విజయవాడ, అనంతపురం, పుట్టపర్తి, రాజమండ్రి, ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు.

824

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles