నిరుపేదకు ‘హెల్పింగ్ హ్యాండ్’ చేయూత

Mon,January 14, 2019 01:04 AM

-నరాల శస్త్ర చికిత్సతో బాలిక ప్రాణాలు కాపాడిన ఫౌండేషన్
- ఇప్పటి వరకు ఐదు వేల మందికి చికిత్సలు
అబిడ్స్, నమస్తే తెలంగాణ : కూతురుకు వచ్చిన వ్యాధికి చికిత్స చేయించలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ‘హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్’ చేయూతనిచ్చి అరుదైన నరాల శస్త్ర చికిత్స చేయించి ప్రాణాలను కాపాడింది. నాంపల్లి హబీబ్ నివాసముండే మజీద్ ఎ బాబర్ ఉద్దీన్ మసీద్ మౌజన్ పని చేస్తున్నాడు. ఆయన కూతురు బేబి ఖతీజా(11) గత సంవత్సరం నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధ పడుతున్నది. దీంతో తండ్రి ఆమెకు పలు దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించగా, ఆమె హైడ్రోసెఫలస్(నరాల సంబంధిత) వ్యాధితో బాధ పడుతున్నట్లు తేలింది. బాలిక చికిత్సకు దాదాపు మూడు నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలుపడంతో తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అంత ఖర్చు పెట్టలేనని మజీద్ సభ్యుడైన మౌల్వీ సలహాతో నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సంప్రదించారు.

వ్యాధి తీవ్రతను పూర్తిగా తెలుసుకున్న ఫౌండేషన్ ప్రతినిధులు ప్యానెల్ న్యూరో సర్జన్ సంప్రదించి నిధుల సమీకరణ ప్రచారాన్ని చేపట్టగా, ప్రత్యేక ప్యాకేజీ కింద దాదాపు రెండున్నర లక్షల రూపాయల నిధులు అవసరం కావడంతో దాతల నుంచి లక్ష్యిత నిధులను సమీకరించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో పూర్తిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేసినట్లు బాలిక తండ్రి మజీద్ ఎ బాబర్ ఉద్దీన్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు ముజ్తబా హసన్ అన్సారీ పేర్కొన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్ అమీర్ పాస్ మాట్లాడుతూ మూడవ వెంట్రిక్యులర్ తిత్తి అనేది సాధారణంగా మెదడు మధ్య భాగంలో ఉంటుందని, సాధారణంగా నీటితో నింపబడిన తిత్తి అన్నారు. ఎండోస్కోపిక్ విధానాన్ని ఎంపిక చేసుకుని శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అరుదైన, క్లిష్టతరమైన పద్ధతిని ఎంతో సులభంగా నిర్వహించి పేద కుటుంబానికి చెందిన బాలిక ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్ అమీర్ పేర్కొన్నారు.

5వేల మార్కును చేరుకున్న హెచ్
2007లో స్థాపించిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్ నేటి వరకు అధిక ఖర్చులను భరించలేని, ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన 5,004 శస్త్ర చికిత్సలను చేయించింది. ఈ శస్త్ర చికిత్స కోసం దాదాపు రూ.53 కోట్ల నిధులను సమీకరించినట్లు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అక్సారీ, మహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.

496

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles