సంక్రాంతి చోరీలకు చెక్!

Mon,January 14, 2019 01:03 AM

-రాచకొండ పరిధిలో ‘ఆపరేషన్ సంక్రాంతి ఫెస్టివెల్’
-దొంగతనాల నియంత్రణకు..400 పోలీసులతో గస్తీ
-ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి
-గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ క్లియర్
-అలికిడి విన్నా..అనుమానాస్పదంగా కనిపించినా.. డయల్ 100
-హాట్ బుక్స్ పాయింట్లకు జియోట్యాగింగ్
-చోరీలు చోటుచేసుకోకుండారాచకొండ పోలీస్ చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంక్రాంతి పండుగకు ఊరెళ్లుతున్నారా.... ఇండ్ల తాళం వేశారా... అయితే ఎలాంటి భయం చెందనవసరం లేదు .. వీరి కోసం రాచకొండ పోలీసులు భద్రత, గస్తీని పెంచారు. పోలీసుల గస్తీకి ప్రజల తోడ్పాడు కూడా ఉంటే దొంగతనాలు జరుగకుండా నివారించవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ పోలీసులు ‘ఆపరేషన్ సంక్రాంతి ఫెస్టివెల్’తో పహారా నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో చో రీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాత్త్రగా ఆయా ప్రాంతా ల్లో ప్రత్యేక బందోబస్తు, గస్తీ, పహారాను ఏర్పాటు చేశా రు. దొంగలు పంజా విసరకుండా ముందస్తు జాగ్రత్తలతో వాటిని కట్టడి చేయడానికి గస్తీని పెంచారు. విజుబుల్ పోలీసింగ్ పాటు సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత చర్యలతో పాటు గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. శనివారం నుంచే ప్రజలు సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇండ్లపై నిఘా పెట్టారు.
అయితే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేసిప్పటికీ... ప్రజ ల భాగస్వామ్యం కూడా తోడైతేనే నేరాలను పూర్తిగా అరికట్టగలరు. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట గస్తీలో స్థానిక యువత సహాకారాన్ని తీసుకుంటూ పోలీసులు పెట్రోలింగ్ చేపడుతున్నారు. కమిషనరేట్ పరిధికి చెందిన సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్ ఎస్ శాంతిభద్రతలు, ట్రాఫిక్, ఐటీ సెల్ ఇలా ప్రతి ఒక్క విభాగం సిబ్బంది ప్ర జల రక్షణ కోసం విధుల్లో ఉన్నారు. దాదాపు 400 మం ది సిబ్బందితో ‘ఆపరేషన్ సంక్రాంతి ఫెస్టివెల్’ సక్సెస్ కోసం దొంగలపై నిఘాను పెంచారు.

చోరీలు అవకాశం ఉన్న ప్రాంతాలు మ్యాపింగ్
మూడు సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా చోరీ లు జరుగుతున్న ప్రాంతాలను విశ్లేషించుకున్న పోలీసు బాసులు... ఆ నేరప్రక్రీయను పరిశీలించారు. ఆ సంఘటనలు జరిగినప్పుడు నిందితుల రాకపోకలు, తాళం ఉన్న ఇండ్ల గుర్తింపు, చోరీ తర్వాత పారిపోయిన తీరు ఇలా...అన్ని కోణాలను క్రోడీకరించుకున్నారు. అలా ఆ ప్రాంతాలను హాట్ కేంద్రీకరించి.. కొత్తగా ఏర్పడిన ప్రాంతాలు, పండుగకు తాళం ఉండే ప్రాంతాలను గుర్తించి... వాటిని మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ అనుసారంగా రాత్రి గస్తీని, పగటిపూట గస్తీని పెంచి నిరంతరం నిఘా ను పెట్టారు. దీంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో స్థానిక యువతను కలుపుకుని చోరీలు జరిగే అవకాశం ఉన్న కాలనీల్లో పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు.

స్పాట్ అనుమానితుల గుర్తింపు
చోరీల కోసం తిరిగే వారిని గుర్తించేందుకు ఉన్నతాధికారులు పెట్రోలింగ్ సిబ్బందికి పాపిలాన్ టెక్నాలజీ యం త్రాలను అందించారు. దీంతో గస్తీ సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడిన వెంటనే ఈ టెక్నాలజీ మెషిన్ ద్వారా అతని వేలు ముద్రలను సేకరించి.. పాత నేర చరిత్ర ఉంటే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఈ మెషిన్ ప్రతి పోలీస్ స్టేషన్ రెండింటి ని అందించి.. వాటిని గస్తీలో వినియోగిస్తున్నారు. మరో వైపు 59వేల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
దొంగలు తప్పించుకోకుండా ఏర్పాట్లు
స్నాచింగ్ పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. స్నాచింగ్ సమాచారం రాగానే శాంతిభద్రతలు, నేరాలను నియంత్రించే విభాగాల సిబ్బంది కాకుండా ట్రాఫిక్ పోలీసుల ను అలర్ట్ చేస్తున్నారు. రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫి క్ కానిస్టేబుల్, అధికారులకు దొంగ లేదా స్నాచర్లకు సం బంధించిన ఫొటోలు, ఆనవాలను పంపించి అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు రెడీగా ఉంటారు. ఇలా దొం గైనా, స్నా చరైనా తప్పించుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

452

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles