నిషేధిత చైనా మాంజాల విక్రయంపై పోలీస్ నిఘా


Mon,January 14, 2019 01:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. రంగు రంగుల పతంగులు గాల్లో ఎగురుతుంటాయి.. ఈ సంబురాలు పక్షుల ప్రాణాలపైకి వస్తున్నాయి. దీంతో పర్యావరణానికి చైనాలో తయారైన మాంజాలు హాని చేస్తున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే వాటి వాడకం, విక్రయాలపై నిషేధం విధించింది. దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసులు పతంగుల విక్రయశాలలపై నిఘాను పటిష్టం చేశారు. తక్కువ ధరకు వచ్చే చైనా మాంజాలను మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని మూడు కమిషనరేట్ పోలీసులు సీరియస్ తీసుకున్నారు. చైనీస్ మాంజా(నైలాన్ దారం), గ్లాస్ తయారు చేసిన మాంజాలను హోల్ విక్రయిస్తున్న వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. సెక్షన్ 5 ఆఫ్ ఎన్విరాన్ యాక్ట్ 1986 ప్రకారం ఇలాంటి మాంజాలు, దారాలను విక్రయించడం చట్టవిరుద్ధం. ఈ నిషేధిత మాంజాలను చైనీస్ దోర్ అని కూడా పిలుస్తారు. ఇవి వాడడం వల్ల పర్యావరణానికి హాని కల్గుతుంది. పక్షులతో పాటు పండుగుల సమయాల్లో మనుషులకు కూడా ఈ మాంజాలతో హాని కల్గుతుంది. ఇలాంటి నష్టాలు ఉండడంతో ప్రభుత్వం వీటి వాడడాన్ని పూర్తిగా నిషేధించింది.


కొనసాగుతున్న నిఘా..
సంక్రాంతి పండుగకు అన్ని వర్గాల ప్రజలు పతంగులు ఎగురవేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. కొందరు పతంగుల ఎగురవేతలో అవతలి వాళ్ల పతంగులను కట్ చేసేందుకు బలమైన దారం ఉండాలనే ఉద్ధేశ్యంతో నిషేధిత మాంజాలను ఉపయోగిస్తుంటారు. వీటిని ఉపయోగించ డం వల్ల పక్షులకు కల్గే అనార్థాల గురించి ఆలోచించరు. పతంగులు ఎగురవేసేవారు కూడా పర్యావర ణం, పక్షుల ప్రాణాల గురించి ఆలోచించాల్సిన అవసరముంటుం ది. వ్యాపారులు కూడా తాత్కాలికంగా గిరాకీ ఉండే మాంజాలను దొడ్డిదారిలో విక్రయించే ప్రయత్నా లు చేస్తుంటారు. దీంతో ఆయా పోలీస్ పరిధిలోని పతంగుల విక్రయదారులపై పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ పోలీసులతో పాటు టాస్క్ ఎస్ పోలీసులు నిఘాను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మూడు రోజులుగా విస్తృతంగా సోదాలు చేస్తూ పదుల సంఖ్యలో వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాల వల్ల కలిగే నష్టాన్ని ఆయా కుటుంబ పెద్దలు ప్లిలలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎక్కడైనా విక్రయాలు జరుగుతున్నాయంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మూడు కమిషనరేట్ల పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

482

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles