పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం.. చలో చలో


Sun,January 13, 2019 12:38 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : సంక్రాంతి రద్దీ పోటెత్తింది. బస్సు అయినా, రైలు అయినా.. సీటున్నా.. లేకున్నా సరే.. ఎలాగైనా పల్లెకు పోవాల్సిందే అన్నట్లుగా.. నగరం నుంచి లక్షలాది మంది తమ సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున బయలుదేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. జూబ్లీ బస్ ఎంజీబీఎస్ ఎల్ ఉప్పల్, మెహిదీపట్నం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని కూడళ్లు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. టోల్ వద్ద పెద్దఎత్తున వాహనాలు బారులు తీరాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరే వందకుపైగా ఎక్స్ రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి.

790

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles