తదిగిన తోం.. తదిగిన తోం..


Sun,January 13, 2019 12:24 AM

-నయా కళాకారుల ‘నృత్య షో కేస్’
-సమ్మేళనంలో విభిన్నకళాకృతుల ప్రదర్శన
-పాల్గొన్న పలువురు చిత్రకారులు, నృత్యకారులు, ఫొటోగ్రాఫర్లు
సిటీబ్యూరో: విభిన్న కళాకృతులైన సంగీతం, ఆర్ట్, సంస్కృతిల సమ్మేళనం రెండు రోజుల పాటు నగరంలో సందడి చేస్తున్నది. యువతను, నవ యువ కళాకారులను ప్రోత్సహించే దిశగా సాగుతున్న ఈ ప్రదర్శన “నృత్య షో కేస్ పేరిట జూబ్లీహిల్స్, రోడ్ నెం:46లోని దుర్గం చెరువు తీరాన వెలసిన ఆలివ్ బిస్ట్రో వేదికపై శనివారం ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే వారంతా కొత్తగా ఆయా రంగాల్లో అడుగు పెట్టినవారే. వారి వారి ఒరిజినల్ వర్క్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. షో కేస్ సంగీతం, ఫొటోగ్రఫీ, ఇలుస్ట్రేషన్స్ ఇంకా మరెన్నో కళాత్మకమైన ప్రదర్శనలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన ప్రదర్శనలు రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి.దేశ వ్యాప్తంగా అసాధారణ ప్రతిభావంతులైన 12 మంది మ్యూజిషియన్లతో పాటు ఇల్లస్ట్రేటర్లు, ఫొటోగ్రాఫర్లు, పెయింటర్లు, క్రాఫ్ట్ సహా 75 మందికి పైగా కళాకారులు ఈ ‘నృత్య’ షోలో పాల్గొన్నారు. ఫుడ్ వర్క్ మిక్సాలజీ వర్క్ షాప్, ఫిల్మ్ స్క్రీనింగ్, కల్మీ, స్ట్రీట్ ప్లే / డ్రమాటిక్ పోయెట్రీ తదితర రకాల ప్రదర్శనలు శనివారం జరిగాయి. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలోనూ వివిధ రకాల పక్షుల ఫొటోగ్రాఫ్స్ ప్రదర్శనకు ఉంచారు. ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు యోగా వర్క్ లెదర్ వర్క్స్, భరత నాట్య ప్రదర్శనలు, ఫిల్మ్ స్క్రీనింగ్, నుష్ ల్యూయిస్, అపీ ఎకోస్ జాజ్ సంగీత ప్రదర్శన, పుస్తకావిష్కరణ, సంగీత కార్యక్రమాలు ఉంటాయి.

440

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles