పాత్రికేయులకు దిశను నేర్పిన జర్నలిస్టు శ్రీకాంత్


Sun,January 13, 2019 12:23 AM

ఖైరతాబాద్, జనవరి 12 : భావి పాత్రికేయులకు దిశను నేర్పిన జర్నిలిస్టు దివంగత గుర్రంకొండ శ్రీకాంత్ అని సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ అన్నారు. శనివారం శ్రీకాంత్ వర్థంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీకాంత్ చిత్రపటానికి టంకశాల అశోక్ పాటు సీనియర్ జర్నలిస్టులు లక్ష్మణ్ రావు, యూసుఫ్ బాబు, అజితతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన టంకశాల అశోక్ శ్రీకాంత్ ఉన్న అనుబంధాన్ని, జర్నలిజం వృత్తిలో ఆయన అందించిన సేవలను వివరించారు. జర్నలిస్టు దిగ్గజం, సాహితీ వేత్త గుర్రంకొండ శ్రీకాంత్ తన జర్నలిజం వృత్తిలో ఎందరో శిష్యులను తయారు చేశారని, మంచి పాత్రికేయులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. వామపక్ష ఉద్యమకర్తగా, సాహితీవేత్తగా, జర్నలిస్టుగా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఎలాంటి బేషభావాలు లేకుండా అందరితో కలిసిపోయే వారని, మంచి స్నేహితులుగా మెలిగేవారన్నారు. ప్రతి జర్నలిస్టులు ఆయన అడుగుజాడల్లో నడువాలన్నారు. సీనియర్ జర్నలిస్టు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శ్రీకాంత్ కీలక భూమిక పోషించారన్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలకు ఉపన్యాసాలను రాసి ఇచ్చిన శ్రీకాంత్ ఆయన విజయాల్లో వెన్నంటి ఉన్నారన్నారు. 1999లో వార్త జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ చేరిన క్రమంలో ఎందరో శిష్యులను తయారు చేశారని, నేడు అనేక మంది ఈ రంగంలో రాణించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన శిష్య బృందం అశోక్ ఉన్నారు

417

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles