నుమాయిష్ ఘన చరిత్ర


Sun,January 13, 2019 12:22 AM

-నగర సీపీ అంజనీకుమార్
-పోలీస్ స్టాల్ ప్రారంభించి..మినీ ట్రైన్ ప్రయాణించిన సీపీ
-ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన విద్యార్థులు
అబిడ్స్, నమస్తే తెలంగాణ : నాంపల్లిలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నగరంలో ఒక పండుగలా జరుగుతుందని, నుమాయిష్ ఎంతో చరిత్ర ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలో 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో భాగంగా బేగంబజార్ పోలీసుల ఆధ్వర్యంలో నుమాయిష్ ఏర్పాటు చేసిన బేగంబజార్ ఔట్ పోస్టు, ట్రాఫిక్ స్టాల్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ క్రైం సీపీ షీఖాగోయెల్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ అనిల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీ రంగారెడ్డిలతో కలిసి పోలీస్ స్టాల్ ఆయన ప్రారంభించారు. అనంతరం స్టాల్ శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియమ నిబంధనలపై తీసుకుంటున్న జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన చిత్రాలను సీపీ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ 1938లో ప్రారంభమైన నుమాయిష్ రోజు రోజుకు ఆదరణ పొందుతూ 79 వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. నగరంలో చారిత్రాత్మకమైన చార్మినార్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండటంతో నగరానికి ఎంతో వన్నె తెస్తుందన్నారు.


నగర పోలీసు విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, షీటీమ్ సంయుక్తంగా పని చేయడంతో నుమాయిష్ ప్రజలకు భద్రతపై మరింత భరోసా లభిస్తుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వలనే ఎలాంటి సంఘటనలు జరుగకుండా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. తెలంగాణ పోలీసుల పని తీరుకు ఢిల్లీ పోలీసుల నుంచి ప్రశంసలు అందాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే మంచి చెడులపై అవగాహన కల్పించి చైతన్య పర్చాలన్నారు. నగరంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నేరాలను గణనీయంగా తగ్గించడంతోపాటు భరోసా సెంటర్, షీటీమ్ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చే సందర్శకులు వారి పిల్లలకు స్టాల్స్ ఏర్పాటు చేసిన నిబంధనలపై తమ సిబ్బంది వివరిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రూల్స్ అండ్ రోడ్స్, డోంట్ క్రాస్ రోడ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు, తలకు హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడుపాలి అంటూ రాసిన ప్లకార్డులు విద్యార్థులు చేతపట్టుకొని సందర్శకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ విద్యార్థులను అభినందించారు.
మినీ ట్రైన్ తిరిగిన సీపీ
ఎగ్జిబిషన్ మైదానాన్ని క్షణాల్లో చుట్టు ముట్టేందుకు ఏర్పాటు చేసిన మినీ ట్రైన్ సీపీ అంజనీకుమార్ ప్రయాణం చేశారు. అడిషనల్ క్రైం సీపీ షీఖాగోయెల్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ అనిల్ డీసీపీలు చౌహాన్, విశ్వప్రసాద్, బాబురావు, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీ రంగారెడ్డి, పోలీస్ అధికారులు నర్మద, రాములు నాయక్, శ్రీనివాస్ నర్సింగ్ హరీశ్ తదితరులు మినీ ట్రైన్ ప్రయాణం చేసి ఎగ్జిబిషన్ చుట్టు ముట్టారు.

651

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles