-నగర మేయర్ బొంతు రామ్మోహన్
-కైట్ ఫెస్ట్, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న119 మంది మహిళలు
-హాజరైన ఎమ్మెల్యే గాంధీ, పలువురు అధికారులు, సినీనటి సోనీచరిష్టా
మాదాపూర్ : స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జీహెచ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీల్లో జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, బొంతు శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సినీనటి సోనీచరిష్టా, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్ పూజితగౌడ్, రాగం నాగేందర్ యాదవ్, బొబ్బ నవతరెడ్డి, ఉపకమిషనర్ యాదగిరిరావు, వెంకన్న తేజావత్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగరాన్ని స్వచ్ఛత వైపు నడిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం వహించి ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును గతంలో మన నగరమే సాధించిందని, అదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా స్వచ్ఛ సర్వేక్షణ్ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గతంలో మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారని, అదే స్ఫూర్తితో నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో రెట్టింపు దూకుడు అవసరమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నంబర్ స్థానంలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ప్రతిఒక్కరూ పరిసరాలను అందంగా తీర్చిదిద్ది స్వచ్ఛతను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తూ ఇతరులతో చేయించాలన్నారు. మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో మన సంప్రదాయాన్ని చాటేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతిlr అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. అనంతరం కళాకారులు జానపద పాటలను ఆలపిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో 119 మంది పాల్గొని రంగురంగుల ముగ్గులను వేసి అలరించారు. వీరిలో మొదటి బహుమతి వరలక్ష్మి, రెండో బహుమతి దీపిక, మూడో బహుమతి లక్ష్మమ్మలకు శాలువా కప్పి బహుమతులను అందజేశారు.