దృఢసంకల్పానికి.. యువతే ప్రతిబింబం


Sun,January 13, 2019 12:21 AM

-వివేకానంద విగ్రహావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
శంషాబాద్ : స్వామి వివేకానందుడు భారతీయ సంస్కృతికి, యువత దృఢమైన సంకల్పానికి ప్రతిబింబమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ హైదరాబాద్ చాప్టర్ ఆవరణలో శనివారం జరిగిన స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువ దినోత్సవంలో వెంకయ్యనాయుడు వివేకానంద విగ్రహావిష్కరణ గావించారు. అనంతరం శిక్షకులైన విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణలో వారి ప్రతిభాపాటవాలు, సదుపాయాలు, ఇతర అంశాలపై చర్చించారు. స్వర్ణభారత్ విద్యార్థులకు నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇస్తూ చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగ బాటలో ఉన్నారని, సమాజానికి ఎంతో ప్రయోజనకరంతోపాటు ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం శంషాబాద్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేయనున్నారు.

276

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles