కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు

Sun,January 13, 2019 12:20 AM

-మేయర్ బొంతు రామ్మోహన్
శేరిలింగంపల్లి: రాష్ట్రంలోనే మొదటిసారిగా కూరగాయల మార్కెట్లలోని వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు నల్లగండ్ల కూరగాయల మార్కెట్ ప్రయోగాత్మకంగా యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శనివారం వెస్ట్ పరిధిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ చేసే విధంగా నూతనంగా అందుబాటులోకి తెచ్చిన యంత్రాన్ని ఆయన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రంతో నలగండ్ల కూరగాయాల మార్కెట్ ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఉండకుండా స్వచ్ఛ మార్కెట్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి జీహెచ్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. నల్లగండ్ల మార్కెట్ పైలట్ ప్రాజెక్టు కింద అందుబాటులోకి తెచ్చిన ఈ యంత్రం పనితీరును సమీక్షించి నగరంలోని మిగిలిన మార్కెట్లలోనూ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత మార్కెట్ తీర్చిదిద్దే దిశగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుభ్రత పాటించి కూరగాయల మార్కెట్ స్వచ్ఛ మార్కెట్ తీర్చిదిద్దాలన్నారు. వెస్ట్ కమిషనర్ దాసరి హరిచందన, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, శేరిలింగంపల్లి డీసీ వెంకన్న, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వీరేశంగౌడ్, ఉపాధ్యక్షుడు ఖాజ పాషా, జనరల్ సెక్రెటరీ అహ్మద్ పాల్గొన్నారు.

362

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles