నగరాన్ని అగ్రభాగాన నిలుపుదాం


Sun,January 13, 2019 12:19 AM

చాంద్రాయణగుట్ట: స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో నగరాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కలసికట్టుగా కృషి చేయాలని బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన నగరంగా అభివృద్ధి చేద్దామని ఆయన కోరారు. కోటి మంది ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత జీహెచ్ సిబ్బందిపై ఉందన్నారు. శనివారం దక్షిణ మండలం మున్సిపల్ కార్యాలయం పరిధిలో బండ్లగూడలోని తాజ్ ఫంక్షన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’పై మున్సిపల్ సిబ్బందికి అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ..కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అనతికాలంలోనే విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ దేశంలోనే నంబర్ సీఎంగా కేసీఆర్ ఉన్నారన్నారు. మున్సిపల్ సిబ్బందికి ఇచ్చిన మాట ప్రకారం జీతాలను పెంచారని గుర్తు చేశారు.గ్రేటర్ దక్షిణ మండలం పరిధి ఎక్కువగా ఉంటుందని, క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. నగరమంతా నిద్రిస్తున్నప్పుడు వారు విధులు నిర్వహిస్తూ తెల్లవారేసరికి పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతారన్నారు. అధికారులు, సిబ్బంది, కార్మికులకు చేదోడువాదోడుగా ఉంటూ ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో నగరాన్ని ముందంజలో నిలిపేందుకు పాటుపడాలని కోరారు.


కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నగరవాసుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛతపై నగరవాసుల్లో చైతన్యం తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థల సేవలను ఉపయోగించకుంటామన్నారు. కోటికిపైగా జనాభాగల నగరాన్ని 30వేల మంది సిబ్బంది శుభ్రం చేయడం ఎంతో కష్టసాధ్యమని, అందుకే నగరవాసులు వ్యర్థాలను రోడ్లపై వేయకుండా నిర్ధేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని, లేనిపక్షంలో సిబ్బందికి ఇవ్వాలని కోరారు. రోడ్లపై వ్యర్థాలు వేసేవారికి, నీటిని వదిలేవారికి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వాహనాలను కడుగుతూ రోడ్లపై నీటిని వదులుతున్నారని, దీనివల్ల రోడ్లు పాడవుతున్నాయని చెప్పారు. దీనివల్ల మాటిమాటికీ రోడ్లను మరమ్మతు చేయాల్సి వస్తున్నదన్నారు. రోడ్లపై, నాలాల్లో వ్యర్థాలు వేసేవారిని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారిని శిక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత గ్రేటర్ అదనపు కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్లు పల్లె మోహన్ శ్రీనివాస్, అలివేలు మంగతాయరు, సారలమ్మ,బడుగు సుమన్ ఏఎంహెచ్ విజయ్ ఏవీ శివప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఖాద్రీ పాల్గొన్నారు.

418

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles