దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్

Sat,January 12, 2019 12:41 AM

బేగంబజార్: తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో కరెంట్, శాంతి భద్రతల సమస్యలు, నక్సలిజం పెరిగిపోతాయని మాజీ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పికొట్టారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో గోషామహల్ శివకుమార్ పోలీస్ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన వార్షిక స్పోర్ట్, గేమ్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు 6 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి నేడు తెలంగాణ పోలీసులను దేశంలోనే నంబర్ వన్ నిలిపారన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ నగరానికి చెందిన కానిస్టేబుళ్ల పనితీరును కొనియాడారు.

నగరంలో ఇటీవల చోటుచేసుకున్న మ్యూజియం చోరీ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు చాలెంజ్ తీసుకొని దొంగలను పట్టుకున్నారని, సొత్తును రికవరీ చేశారని, ఈ వార్త లండన్ టైమ్స్, న్యూయార్క్, దుబాయ్ వంటి ప్రధాన పత్రికల్లో వచ్చిందన్నారు. అంతకు ముందు నిర్వహించిన హైదరాబాద్ సిటీపోలీస్, హోం మంత్రి టీం మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఇందులో హోం మంత్రి టీం సభ్యులు విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్, గేమ్ మీట్ చాంపియన్ మొదటి విజేతగా సీఏఆర్ హెడ్ , రెండో స్థానంలో సౌత్ నిలిచింది. విజేతలకు హోం మంత్రి మహమూద్ సీపీ అంజనీకుమార్ కప్పు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ శిఖాగోయల్, అదనపు సీపీ ట్రాఫిక్ అనిల్ అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ డీఎస్ చౌహాన్, అదనపు సీపీ అడ్మిన్ శివప్రసాద్,అదనపు సీపీ హెడ్ క్వార్టర్స్ టి మురళీకృష్ణ, జాయింట్ సీపీ ఎస్ డాక్టర్ తరుణ్ జోషి, నార్త్ డీసీపీ కమలేశ్వర్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

453

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles