డంపింగ్ యార్డు క్యాపింగ్ మొదటి దశ పూర్తి


Sat,January 12, 2019 12:39 AM

-రెండో దశ పనులు షురూ..
-జూన్ చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యం
-పనులను పరిశీలించిన జీహెచ్ కమిషనర్ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జవహర్ నిర్వహిస్తున్న దేశంలోనే అతిపెద్ద డంపింగ్ క్యాపింగ్ పనుల్లో మొదటిదశ పూర్తయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన చాలా వరకు తగ్గింది. దీంతో మలిదశ పనులకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ కమిషనర్ ఎం. దానకిశోర్ శుక్రవారం డంపింగ్ యార్డును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో డంపింగ్ క్యాపింగ్ పనులకు గ్రీన్ ఇచ్చింది. రూ.144 కోట్ల వ్యయంతో రాంకీ ఎన్విరో సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా నిర్వహిస్తున్న డంపింగ్ మట్టి కప్పే ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వ్యర్థాలపై కప్పేందుకు దాదాపు ఆరువేల టన్నుల మట్టిని వినియోగించినట్లు వారు పేర్కొన్నారు.


దీంతో వారు రెండోదశ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మట్టి పొరపై జియోసింథటిక్ క్లే లైనింగ్ పనులు చేపట్టారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఈ పనులు కూడా పూర్తవుతాయని, దీంతో క్యాపింగ్ ప్రక్రియ పరిపూర్ణమవుతుందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు, దీంతో ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో మన నగరం ఇతర నగరాలకు ఆదర్శంగా మారుతుందని వారు పేర్కొన్నారు. వ్యర్థాల డంపింగ్ ఇంత భారీస్థాయిలో క్యాపింగ్ నిర్వహించిన పెద్ద నగరంలో హైదరాబాదేనని వారు చెప్పారు. డంపింగ్ నుంచి వెలువడే విషద్రవాలు(లీచెట్), మీథేన్ వాయువు బయటకు తీసేందుకు 152 బోరుబావులు వేయాల్సి ఉండగా, 100 వేసినట్లు అధికారులు చెప్పారు. వీటిని విద్యుత్ తయారీకి వినియోగించడంతోపాటు వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. చెత్త ద్వారా ఎరువులు తయారీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ తదితర యంత్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 20 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు దసరా నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాంకీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన చాలా వరకు తగ్గడంతోపాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని అధికారులు వివరించారు.

495

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles