తెలంగాణ వచ్చాకే వ్యవసాయం పండుగ

Sat,January 12, 2019 12:36 AM

బేగంబజార్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరమే వ్యవసాయదారులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఈ మేరకు వ్యవసాయ అధికారుల కృషి ఎంతగానో ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ పేర్కొన్నారు.శుక్రవారం బషీర్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల కేంద్ర సంఘం 2019 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్, వ్యవసాయ విస్తరణ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు డి శ్రీనివాస్ కె సురేష్ రెడ్డిలతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాల హ యాంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ శాఖను బలోపేతం చేయడంతో పాటు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశంలోనే నెంబర్ నిలిచారన్నారు.

టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు,రైతు భీమాపథకాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సమర్థవంతగా పనిచేశారని కొనియాడారు.దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలంగాణ రైతు బంధు పథకాన్ని అమలు చేసే విధంగా కృషి చేసిన అధికారులకు ఒక నెల బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఉన్నతాధికారులను కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు డి శ్రీనివాస్ కె సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ మా పంట,మా భూమి,రైతు సమగ్ర సర్వే వివరాలను ఆన్ పొందుపర్చుటకు ప్రతి రైతు వివరాలకు 3రూపాయల చొప్పు న ఇస్తామన్న నిధులను ప్రభుత్వం వెంటనే సంభందిత జిల్లా ఏఈవోలకు విడుదల చేసి ఆర్ధిక తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రదాన కార్య దర్శి మామిళ్ళ రాజేందర్, కోశాధికారి రామినేని శ్రీనివాస్ విస్తరణ అధికారుల కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ఎం రాకేశ్,కోశాధికారి ఎస్ శ్రీనివాస్ పాటు కేంద్ర సంఘం సభ్యులు,వివిధ జిల్లాల అధ్యక్ష,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

439

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles