హార్డ్ కాపీలు సమర్పిస్తేనే స్కాలర్


Sat,January 12, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లాలో స్కాలర్ ఫీజు రీయింబర్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా ఆయా దరఖాస్తులను తమకు పంపించాలని, ఇలా చేసిన వారికే మంజూరు చేస్తామని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ డీడీ జాటోతు రామారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సమర్పించని విద్యార్థుల దరఖాస్తులను ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని, ఎప్పటికప్పుడు తమకు సమర్పించాలని సూచించారు. స్కాలర్ దరఖాస్తుల హార్డ్ కాపీలను సమర్పించకుంటే వారికి మంజూరు చేయకుండా, పెండింగ్ పెడుతామని స్పష్టం చేశారు.
ప్రింట్ దరఖాస్తులు అందినవి 70 శాతమే
మీరు స్కాలర్ ఫీజు రీయింబర్స్ కోసం ఆన్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఆ ఆన్ దరఖాస్తును ప్రింట్ తీసుకుని దానికి సరైన ధ్రువపత్రాలను జతచేసి కాలేజీలో ప్రిన్సిపాళ్లకు అందజేయండి. వాటిని సంక్షేమ శాఖలకు ప్రిన్సిపాళ్లు పంపించాలి. ఇలా పంపిస్తేనే స్కాలర్ ఫీజు రీయింబర్స్ మంజూరు చేస్తామని, లేదంటే పెండింగ్ పెడుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్కాలర్ ఫీజు రీయింబర్స్ ఆన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది. అయితే ఇప్పటి వరకు ఆన్ దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం మాత్రమే ప్రింట్ తీసిన దరఖాస్తులను సంక్షేమ శాఖాధికారులకు సమర్పించారని, మరో 30శాతం ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. స్కాలర్ మంజూరు ప్రక్రియ ప్రకారం.. ఆన్ దరఖాస్తులను ప్రింట్ తీసుకుని కాలేజీ ప్రిన్సిపాళ్లకు సమర్పించాలి. వాళ్లు అప్రూవ్ విద్యార్థుల వేలి ముద్రను తీసుకుంటారు. ఆ తర్వాత ప్రిన్సిపాళ్లు వాటిని ఆయా సంక్షేమ శాఖలకు పంపిస్తారు. వాటిని
సంక్షేమాధికారులు పరిశీలించి బార్ బిల్లు జనరేట్ చేస్తేనే స్కాలర్ ఫీజు రీయింబర్స్ మంజూరవుతాయి.

264

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles